రవి హత్య కేసు తిరగదోడితే జగనే తొలిముద్దాయి: సునీత
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పరిటాల రవి హత్య కేసును తిరగతోడితే జగనే తొలి ముద్దాయిగా తేలుతారని పరిటాల సునీత అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై 11వ ఛార్జీషీటు దాఖలు చేసిన అంశాన్ని మీడియా ప్రస్తావించగా ఆమె పై విధంగా స్పందించారు.

జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకొని దాచుకున్నారని ఆరోపించారు. ఏ కేసులోనైనా ఆయనే తొలి ముద్దాయి(ఏ1)గా ఉంటున్నారని అన్నారు.
హైదరాబాద్‌లో ఆందోళన చేస్తున్న మహిళా జర్నలిస్టుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు.












Click it and Unblock the Notifications