వైయస్ జగన్ 420, చంద్రబాబు కడిగిన ముత్యం: మంత్రి పరిటాల సునీత
హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. వైయస్ జగన్ చరిత్రంతా హత్యలు, దోపీడీలేనని ఆరోపించారు. జనం తనను ఈ ఐదేళ్లలో మరచిపోతారని భయపడే రుణమాఫీ పేరిట ధర్నాలు చేస్తున్నారన్నారు.
రైతులపై మాట్లాడే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కడిగిన ముత్యమైతే, జగన్ ఎప్పటికీ 420నే అని విమర్శించారు. బాబు రైతులను ఆదుకుంటే, ఆయన మాత్రం విమర్శలు చేస్తున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పీకర్‌గా ఉన్నప్పటికీ వృత్తి రీత్యా వైద్యుడినైన తాను సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నానని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ వేరుగా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడారు. తరాలుగా కొనసాగుతున్న బహిరంగ మలవిసర్జన అలవాటును నిర్మూలించడమే లక్ష్యంగా, సత్తెనపల్లి నియోజకవర్గంలో 22 వేల మరుగుదొడ్లను నిర్మించామని అన్నారు. 'స్వచ్ఛ భారత్' ద్వారా సామాజిక రుగ్మతలు తొలగిపోతాయని ఆయన స్పష్టం చేశారు.
త్వరలో రాష్ట్రంలో మూడు రోజుల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నామని, దానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఆహ్వానించామని ఆయన తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో అనేక అంశాలపై చర్చ జరుగుతుందని, న్యాయపరమైన అంశాలు కూడా చర్చకు వస్తాయని ఆయన వివరించారు. చర్చల ద్వారా సమాజానికి ఒక సందేశం ఇవ్వవచ్చని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications