మోదీ కోర్ టీంలోకి పవన్, ఢిల్లీ మంత్రాంగం- కీలక బాధ్యతలు..!!

ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహ రచన చేస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదగాలని భావిస్తోంది. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమ యంలో వరుసగా జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక, దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవటం కీలకంగా భావిస్తున్న బీజేపీ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కు మోదీ కోర్ టీంలో స్థానం కల్పించేలా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ ఆమోదం తెలిపితే ఏపీలో నాగబాబుకు ప్రమోషన్ ఖాయంగా కనిపిస్తోంది.

పార్టీ - ప్రభుత్వ ప్రక్షాళన
బీజేపీ నాయకత్వం సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. జమిలి ఎన్నికలకు కసరత్త చేస్తూనే.. ఇప్పటి వరకు దక్కని రాష్ట్రాల్లో పాగా వేయటం పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా పార్టీ - ప్రభుత్వం ప్రక్షాళనకు నిర్ణయించింది. మోదీ కేబినెట్ విస్తరణ వచ్చే నెలలో జరగనుంది. ఈ సారి కేబినెట్ లోకి ఆరెస్సెస్ నేపథ్యం.. పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది . పార్టీపై పూర్తిగా పట్టుబిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయను న్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడుగా నియమించనుంది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ నేతలకు, బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం.

pawan-chances-to-get-key-position-in-central-as-bjp-latest-plan

పవన్ కు కొత్త బాధ్యతలు
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఏపీ నుంచి పవన్ కు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. 2024 లో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. కానీ, జనసేన మంత్రి పదవి తీసుకోలేదు. ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా పవన్ ఆమోదం చెబితే మోదీ కేబినెట్ లో కీలక పోర్టు ఫోలియో ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. పవన్ ఏపీలోనే కొన సాగితే మోదీ రాజకీయ కోర్ కమిటీలో పవన్ కు అవకాశం ఇవ్వనున్నారు. తమిళనాడులో గెలుపు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కొంత కాలంగా పవన్ సైతం తమిళనాడు కేంద్రంగా వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది.

Take a Poll

నాగబాబుకు ప్రమోషన్
పవన్ అంగీకరించి కేంద్ర కేబినెట్ లోకి వెళ్తే..ఆయనకు తమిళనాడులో సహ బాధ్యతలు అప్పగిస్తా రని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా పవన్ ఒప్పుకుంటే ఏపీ కేబినెట్ లోకి నాగబాబు ఎంట్రీ ఇవ్వ నున్నారు. నాగబాబు కేబినెట్ లో చేరిక అంశం సైతం ఢిల్లీలో ముడిపడి ఉందని కూటమి నేతలు ఇప్పటికే చెబుతున్నారు. పవన్ ఏపీలోనే కొనసాగాలని భావిస్తే... ఎన్నికల ప్రచారం వరకు ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. పవన్ బీజేపీ కోసం ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. అయితే, మోదీ టీంలో పని చేసే అవకాశం పవన్ సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో, వచ్చే వారం కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+