ఢిల్లీలో పవన్ కల్యాణ్: ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తోన్నా
అమరావతి/న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దేశ రాజధానికి చేరుకున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి కొద్దిసేపటి కిందటే దేశరాజధానిలో ల్యాండ్ అయ్యారు. మంగళవారం జరగాల్సిన ఎన్డీఏ సంకీర్ణ కూటమి భాగస్వామ్య పక్షాల భేటీకి పవన్ కల్యాణ్ హాజరు కావాల్సి ఉంది.
బీజేపీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంలో పాల్గొనడానికి ఇదివరకే ఆయనకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. జనసేనతో పాటు బీజేపీతో పొత్తు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటోన్న 38 పార్టీలు నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రేపు ఉదయం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. తనను కలిసిన విలేకరులతో మాట్లాారు. చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తోన్నానని, అన్ని అంశాలపైనా మాట్లాడతానని పేర్కొన్నారు. ఎన్డీఏ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ సీనియర్ నేతలు తమను ఆహ్వానించారని పేర్కొన్నారు. ఎన్డీఏ విధానాలు ఎలా ఉంటాయనేది తెలుసుకోబోతోన్నామని, వాటి కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.
కోట్లాదిమంది ప్రజలకు అనుకూల నిర్ణయాలు, ఎన్డీఏ విధానాలు ఉంటాయని తాము ఆశిస్తున్నామని అన్నారు పవన్ కల్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాల పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఏపీ రాజకీయాలపై తాము ఎక్కువగా దృష్టి సారించామని తేల్చి చెప్పారు. పొత్తులు ఎలా ఉండోబోతోన్నాయనేది తరువాత తెలియజేస్తానని అన్నారు.
#WATCH | Janasena party chief Pawan Kalyan says, "I was looking for this opportunity for a long time...We have been called by the senior leaders for tomorrow's meeting (NDA meeting). We are looking forward to seeing how the NDA policies should be taken into the people's side and… pic.twitter.com/NXAsOkzHdr
— ANI (@ANI) July 17, 2023
ప్రస్తుతం ఎన్డీఏలో 30 పార్టీలు ఉన్నాయి. బీజేపీ, ఏఐఏడీఎంకే, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, జననాయక్ జనతా పార్టీ, భారతీయ మక్కల్ కల్వి మున్నేట్ర కజ్గం, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా.. ఇందులో పాల్గొననున్నాయి.
మిజో నేషనల్ ఫ్రంట్, తమిళ మానిల కాంగ్రెస్, ఐపీఎఫ్టీ- త్రిపుర, బోడో పీపుల్స్ పార్టీ, పీఎంకే, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, అప్నా దళ్, అస్సాం గణ పరిషత్, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, నిషాద్ పార్టీ, యూపీపీఎల్, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పుదుచ్చేరి), జనసేన పార్టీల నాయకులు ఇందులో పాల్గొనున్నారు. దీనితో పాటు మరో ఎనిమిది పార్టీలు ఎన్డీఏకు మద్దతు పలికాయి.












Click it and Unblock the Notifications