నిజమేనా: బాలయ్య, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల జోరు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్న విషయం నిజమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజా పరిణామాలను గమనిస్తే అలా అనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో పవన్ కళ్యాణ్, నందమూరి హీరో బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చిత్రాలతో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఆ ఫ్లెక్సీల ఏర్పాటు జోరందుకుంది.
పవన్ కళ్యాణ్ ఇటీవల బాలకృష్ణను కలిసినట్లు, దాదాపు గంటసేపు ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు బాలకృష్ణ అభిమానులు కూడా వారిద్దరి మధ్య భేటీని ధ్రువీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానులు కలిసి జిల్లాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.
"రాష్ట్ర రాజకీయ రంగంలో చంద్రబాబుకు ఒక లెక్కుంది. సినీ రంగంలో పవన్ కల్యాణ్‌కు పవరుంది. చంద్రబాబు లెక్కకి, పవన్ కల్యాణ్ పవర్‌కు నందమూరి నటసింహం బాలయ్య తోడైతే ఎదురేముంది?" అంటూ ఖమ్మంలో ఓ ఫ్లెక్సీలో రాశారు. అ
ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసు పార్టీలో విలీనం చేయడం పవన్ కళ్యాణ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అన్నయ్యకు దూరంగా ఉంటున్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణకు, పవన్ కళ్యాణ్‌కు మధ్య సంబంధాలు పెరిగాయని చెబుతున్నారు. మొత్తం మీద, బాలయ్య, పవన్ కళ్యాణ్‌లో భేటీ ఉదంతం రాజకీయ రంగంలోనే కాకుండా టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications