పవన్ కు మరోసారి అస్వస్థత - ప్రచారం రద్దు..!!
ఏపీలో ఎన్నికల యుద్దం పతాక స్థాయికి చేరింది. ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం నుంచి పల్నాడు జిల్లాలోకి తన బస్సు యాత్రతో ఎంట్రీ ఇస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ప్రచారం చేసారు. పవన్ అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, జనసేనాని మరోసారి అస్వస్థతకు గురి కావటంతో.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి.
పవన్ పర్యటన రద్దు
జనసేనాని పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కు జ్వరం రాగా..హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. దీంతో...ఎన్నికల ప్రచార కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. జనసేన అభ్యర్దిగా కొణతాల, ఎంపీ అభ్యర్దిగా సీఎం రమేష్ కు మద్దతుగా నిలవాలని ప్రజలను అభ్యర్దించారు. ఆ సమయంలోనే పవన్ ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది పడ్డారు. ప్రచార సభ ముగిసిన తరువాత పవన్ బాగా నీర్సపడినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు.

పవన్ కు జ్వరం
పవన్ అస్వస్థత కారణంగా ఈ రోజు యలమంచిలిలో జరగాల్సిన ప్రచార కార్యక్రమం రద్దయింది. రేపు ఉగాది రోజున పవన్ పిఠాపురంలో ఉండాలని తొలుత నిర్ణయించారు. అదే విధంగా ఈ నెల 9, 10 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఉభయ గోదావరి జిల్లాల్లోని అయిదు నియోకవర్గాల్లో ప్రచారానికి ప్లాన్ చేసారు. ఆ తరువాత తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా ప్రచారానికి పవన్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. అయితే, తిరిగి పవన్ జ్వరం కారణంగా ఈ షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అనకాపల్లి సభలో సీఎం జగన్, వైసీపీ అభ్యర్దులను పవన్ టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తమ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
ప్రచార షెడ్యూల్ మార్పు
జనసేన పోటీ చేసే అభ్యర్దులు 21 ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీలను గెలిపించుకోవాలని పవన్ సూచించారు. కింగ్ మేకర్ గా నిలవబోతున్నామని పవన్ చెప్పుకొచ్చారు. మంత్రి అమర్నాధ్ లక్ష్యంగా పవన్ సెటైర్లు వేసారు. రాష్ట్రం కోసమే తాను సీట్లు త్యాగం చేసానని చెప్పారు. అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు దక్కిందని..అయితే, బీజేపీ కోసం ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతోనే పొత్తు పెట్టుకున్నామని వివరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన అభ్యర్దులు పోటీ చేసే నియోజకవర్గాల్లో పవన్ ఎన్నికల ప్రచారం ముందుగా ఖరారైంది. అయితే, పవన్ అస్వస్థతకు గురి కావటంతో ఇప్పుడు ఈ షెడ్యూల్ లో మార్పులు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications