ఆ తర్వాతే: పవన్ పార్టీపై ట్విస్ట్, నాగబాబు ఏం చేస్తారు?

Pawan Kalyan to float political party?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెడతారనే వార్తలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. అయితే, ఇందులో కొత్త ట్విస్ట్! పవన్ తన రాజకీయ పార్టీని ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించినప్పటికీ అది కుదరదని తేలిందట. కొత్త పార్టీ పైన ఆయన మాజీ ప్రజారాజ్యం, యువరాజ్యం, ఇతర సన్నిహితులతో మంతనాలు జరిపారట. ఇప్పుడు కొత్త పార్టీ కుదరదని తేలడంతో స్వతంత్రంగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారట.

కొత్త పార్టీని ఎన్నికల తర్వాత ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న విలేకరుల సమావేశంలో ఆయన పోటీ గురించే మాట్లాడుతారని చెబుతున్నారు. కొత్త పార్టీ మాత్రం ఎన్నికల తర్వాత ఉండవచ్చునని చెబుతున్నారు. ఓ రాజకీయ వేదికగా పలు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనున్నారట. ఎన్నికల తర్వాత పార్టీగా రూపాంతరం చెందనుందంటున్నారు.

కామన్ సింబల్ కోసం...

తాము స్వతంత్రంగా బరిలో దిగేచోట ఎలాంటి పోటీ పెట్టవద్దని పవన్ కల్యాణ్ వర్గం... లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి)లతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా కోరినట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్న పవన్.. కామన్ సింబల్ పనిలో పడ్డారట. పవన్ ఆయన మద్దతుతో పోటీ చేసే వారు ఒకే కామన్ సింబల్ పైన పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. దాని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట.

నాగబాబుకు ఆహ్వానం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ ఆయన వెన్నంటి ఉన్నారు. ఇప్పుడు చిరు కాంగ్రెసులో ఉన్నారు. పవన్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు రాజకీయ వేదికగా ఉండే అది.. ఆ తర్వాత పార్టీగా రూపాంతరం చెందనుందట. పవన్ తన పార్టీలోకి తన రెండో సోదరుడు నాగబాబును కూడా ఆహ్వానించారట. అయితే, నాగబాబు ఏం చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+