పవన్ కళ్యాణ్‌దీ బిసి మంత్రమే: బడుగులకే

హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ బిసీ మంత్రం జపిస్తున్న తరుణంలో తాను పెట్టబోయే పార్టీ జనసేన కూడా బిసీలకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 80 శాతానికి పైగా సీట్లు కేటాయించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బడుగు, బలహీన వర్గాలకు ఇతోధికంగా రాయితీలు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

దాదాపు ఇరవై శాతం దాకా ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్‌కళ్యాణ్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో బీసీతో పాటు దళిత కార్డును వాడాలని పవన్ కళ్యాణ్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

వీడియో కోసం ఫోటోపై క్లిక్ చేయండి

సమైక్యాంధ్రకు ఛాంపియన్లం తామేనని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న వైయ్ససార్ కాంగ్రెస్‌ పార్టీ వైపు అగ్రవర్ణ సామాజిక వర్గం ఉన్నట్లు అంచనాలున్నాయి. పైగా, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూపి ఓటర్లను ఆకర్షించాలని చూస్తోంది. కొత్తగా హామీలు ఏవీ ఇవ్వడం లేదు.

ఈ స్థితిలో నిర్దిష్టంగా బిసి, దళిత వర్గాలకు హామీలను ఇవ్వడం ద్వారా రాజకీయాలను మలుపు తిప్పాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన పెట్టే పార్టీకి కాపు సామాజిక వర్గం నుంచే కాకుండా బడుగు వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.

<center><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="NTM0NTY2fHwyfHwxfHwxLDIsMQ==";var ven_width="100%";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+