చేనేతల కార్మికుల కన్నీళ్ళు తుడుస్తా, ధర్మవరం బ్రాండ్ ఇమేజ్ పెంచుతా: పవన్

అనంతపురం: ధర్మవరం బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే బాధ్యతను తీసుకొంటానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.చేనేత కార్మికుల సమస్యలపై నివేదికను ఇస్తే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ హమీ ఇచ్చారు. అయితే సమయం పట్టినా సమస్య పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తానని పవన్ చెప్పారు.

సోమవారం నాడు అనంతపురం జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటన మూడో రోజు కొనసాగింది. ఉదయం పూట పవన్ కళ్యాణ్ సత్యసాయి సమాధిని సందర్శించారు.

Recommended Video

    పవన్ కొత్త డిమాండ్, అపశృతి: హోదాపై మాట్లాడవేం పవన్ ?

    పుట్టపర్తి నుండి పవన్ కళ్యాణ్ నేరుగా ధర్మవరం చేరుకొని చేనేత కార్మికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

    ధర్మవరం చేనేత బ్రాండ్ ఇమేజ్ పెంచుతా

    ధర్మవరం చేనేత బ్రాండ్ ఇమేజ్ పెంచుతా

    అనంతపురం జిల్లా చేనేత బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ధర్మవరంలో చేనేత కార్మికులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొన్నారు.చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యలను నివేదిక రూపంలో ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. మరో వైపు ఈ సమస్యలను ఆలస్యమైనా పరిష్కరించనున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.

    ధర్మవరం చేనేత పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యం కల్పిస్తా

    ధర్మవరం చేనేత పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యం కల్పిస్తా

    ధర్మవరం చేనేత పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ధర్మవరం నేత కార్మికులే తమ ఉత్పత్తులను విక్రయించుకొనే ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ హమీ ఇచ్చారు.సమయం పట్టినా కానీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు.

     కరువు సమస్యను తీరుస్తాం

    కరువు సమస్యను తీరుస్తాం

    అనంతపురం జిల్లాలో కరువు సమస్యలను తీరుస్తామని పవన్ కళ్యాణ్ ధీమాను వ్యక్తం చేశారు.అనంతపురం జిల్లాను కరువును బయట పడేస్తే ఎందరికో మేలు జరుగుతోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కరువు బారినుండి అనంతపురాన్ని రక్షించేందుకు తన వంతు ప్రయత్నాలను చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

     ప్రజల సమస్యలే ముఖ్యం

    ప్రజల సమస్యలే ముఖ్యం

    ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న కర్తవ్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. సినీ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగంలో ఉన్న సమస్యల కంటే ప్రజల సమస్యలను పరిష్కరించడమే తనకు ఇష్టమన్నారు పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లాలో తాను పర్యటిస్తున్న సమయంలో తమ ఇంటికి రావాలని ఎందరో ఆహ్వనించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+