కేసీఆర్‌ను అడుగుతా, వారికే టిక్కెట్ ఇస్తా: బాబుపై పవన్ సంచలన వ్యాఖ్యలు

Recommended Video

    కేసీఆర్‌ను అడుగుతా, వారికే టిక్కెట్ ఇస్తా : బాబుపై పవన్ సంచలన వ్యాఖ్యలు

    విశాఖపట్నం: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దారితీసేలా ఉత్తరాంధ్ర సమస్యలు ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మేధావులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై పలువురు మేధావులు ప్రసంగించారు. ప్రొఫెసర్ కేఎస్ చలం, ప్రొఫెసర్ కేవీ రమణ, ప్రజా గాయకుడు వంగపండు, వామపక్ష ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    అనంతరం పవన్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ రాకముందే అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని వెల్లడించారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన వారికి ఎకరా భూమి చొప్పున కొనిస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల బాధలను తెలుసుకునేందుకే తాను ఉత్తరాంధ్రలో పర్యటించానని చెప్పారు.

     నేను రెచ్చగొడుతున్నానని చంద్రబాబు భావన

    నేను రెచ్చగొడుతున్నానని చంద్రబాబు భావన

    తన ఉత్తరాంధ్ర పర్యటనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్రేకంగా ఉన్నారని పవన్ ఎద్దేవా చేశారు. తాను ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన భావిస్తున్నారని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉధ్యమ స్ఫూర్తి ఉందని, వారిని రెచ్చగొట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి ఉన్నప్పటికీ నాయకుల్లో మాత్రం లేదన్నారు.

     స్థానికంగా న్యాయం చేసే వారికి టిక్కెట్లు ఇస్తాను, వైసీపీ కాదు..

    స్థానికంగా న్యాయం చేసే వారికి టిక్కెట్లు ఇస్తాను, వైసీపీ కాదు..

    వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ చెప్పారు. స్థానికంగా న్యాయం చేసే వారికే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూములు కబ్జా చేస్తారని టీడీపీ ప్రచారం చేసిందని, కానీ టీడీపీ వాళ్లే లక్షల ఎకరాలు కబ్జా చేయడం దారుణమని వాపోయారు.

    నేను కేసీఆర్‌ను కోరుతా

    నేను కేసీఆర్‌ను కోరుతా

    ఈ ప్రాంతం నుంచి తెలంగాణకు వలసవెళ్లిన 26 కులాలను స్థానికంగా గుర్తించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాను విజ్ఞప్తి చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. సమస్యలు గుర్తించి, పరిష్కరించకపోతే విభజన సమస్యలు వస్తాయని హెచ్చరించారు. అలా జరిగితే మనం చాలా నష్టపోతామని ఆయన అన్నారు.

    నా కొడుకు అంతటి వయస్సున్న చిన్నారిని చూస్తే చర్మవ్యాధులు

    ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైద్యులు మాత్రం ఉండటం లేదన్నారు. ఇటీవల తాను అరకు ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ మారుమూల ప్రాంత చిన్నారులను చూశానని, రక్తహీనత, రేచీకటి, చర్మ సంబంధ వ్యాధులు ఉన్నాయని గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి అంత వయస్సు ఉన్న చిన్నారులు ఉన్నారని, వారిని పట్టుకొని చూస్తే ఒళ్లంతా చర్మ వ్యాధులతో కనపడ్డారన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వైద్యులు లేరని, అంబులెన్సులు లేవన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారంకు తాను కృషి చేస్తానని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+