పవన్ కల్యాణ్ అఫిడవిట్‌లో ఏముంది?
Megastar Chiranjeevi: పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతంగా కొనసాగుతోంది. అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల తీవ్రతను పెంచాయి. అదే సమయంలో నామినేషన్ల పర్వం కూడా జోరెత్తింది. మూడొంతులకు పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 25వ తేదీ తుది గడువు. నామిషన్లను వేయడానికి ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

తాజాగా పవన్ కల్యాణ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తెలుగుదేశం-జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వంగ గీత- ఇక్కడి నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు.
పవన్ కల్యాణ్‌కు తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యుడు ఎస్‌వీఎస్ఎన్ వర్మ మద్దతు ప్రకటించారు. పిఠాపురం టీడీపీ క్యాడర్ మొత్తం పవన్ కల్యాణ్ కోసం గెలుపు కోసం పని చేస్తోంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. భీమవరం, గాజువక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఓటమిపాలయ్యారు. ఇప్పుడు పిఠాపురం రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది.
నామినేషన్ పత్రాలతో పాటు తనకు ఉన్న ఆస్తి వివరాలను కూడా పవన్ కల్యాణ్.. రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. ఇందులో ఎలాంటి వివరాలు ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అఫిడవిట్‌లో వారి ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ముగ్గురూ- పులివెందుల, కుప్పం, మంగళగిరి స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications