రంగంలో దిగిన పవన్ కల్యాణ్: చంద్రబాబు రూట్‌లో..!!
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో అడుగు పెట్టనున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఏపీకి రానున్నారు. మార్చిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఈ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన మళ్లీ ఏపీకి రాబోతోండటం ఇదే తొలిసారి.
బుధవారం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. పంట నష్టపరిహారాన్ని చెల్లించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపిస్తోన్న పవన్ కల్యాణ్- ఇక నేరుగా క్షేత్రస్థాయిలో రైతుల తరఫున పోరాటం చేయనున్నారు.

గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో కడియానికి బయలుదేరి వెళ్తారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్ కల్యాణ్ పరామర్శిస్తారు. కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖిగా సమావేశమౌతారు. వారి కష్టాలను తెలుసుకుంటారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ అయింది. వివిధ నియోజకవర్గాల మీదుగా పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో ఆయన వెంట- జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి గోదావరి జిల్లాల పార్టీ నాయకులు ఆయన వెంట ఉంటారు.
గతంలో ఇదే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ పెద్ద ఎత్తున కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి జనసేన ఈ యాత్రను చేపట్టింది అప్పట్లో. పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొన్నారు. రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు.
ఉమ్మడి గోదావరి జిల్లాలో 40 మందికి పైగా రైతు కుటుంబాలకు ఆయన చెక్కులు అందించారు. రైతు సమస్యల మీదే పవన్ కల్యాణ్ మరోసారి పర్యటించబోతోన్నారు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. ఇప్పుడు అదే రూట్‌లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో అడుగు పెట్టనున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఏపీకి రానున్నారు. మార్చిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఈ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన మళ్లీ ఏపీకి రాబోతోండటం ఇదే తొలిసారి.
బుధవారం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. పంట నష్టపరిహారాన్ని చెల్లించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications