పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలతో బాధపడ్డా, మెసేజ్ పంపా: జెపి
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తాను చాలా బాధపడ్డానని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి జయప్రకాశ్ నారాయణ శనివారం అన్నారు. జెపి అంటే ఇష్టమని, ఆయన తరఫున ప్రచారం చేస్తానని గతంలో చెప్పిన పవన్.. ఆ తర్వాత టిడిపి, బిజెపి కూటమికి మద్దతిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
దీనిపై జెపి స్పందించారు. మనసులో జెపి.. పొత్తు ధర్మం ప్రకారం మద్దతు మాత్రం టిడిపి అభ్యర్థి మల్లారెడ్డికేనని పవన్ చెప్పారని, ఆ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నారో తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. ఈ విషయంపై పవన్‌కు మెసేజ్ పంపించినట్లు చెప్పారు.

మోడీ లాంటి సమర్థ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమన్నారు. ఆయనకే తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. పలువురు వ్యాపారవేత్తలు తమ వ్యాపారాభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చి తనను ఓడించేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారిని ఓటర్లు తిరస్కరించాలన్నారు.
పల్నాడు జిల్లా చేస్తాం: రాయపాటి
గుంటూరు జిల్లా నరసరావుపేట లోకసభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన రాయపాటి సాంబశివ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే పల్నాడు ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నరసరావుపేటలో రైల్వే కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. కేంద్రం నుంచి సీమాంధ్రకు నిధులను రాబట్టేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications