సోనియా ఇంట్లోనే జగన్ పార్టీ అధిష్టానం: పయ్యావుల

 Payyavula Keshav
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిష్టానం కాంగ్రెసు అధ్యక్షురాలు ోసనియా గాంధీ నివాసంలోనే ఉందని తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాంత నాయకుడు పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావులతో కుమ్మక్కయి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనపై అడుగులు వేస్తోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. జగన్, కెసిఆర్‌లతో కలిసి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెసు రాష్ట్ర విభజనకు పూనుకుందని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు దీక్షలు చేసిన మర్నాడే తెలంగాణ నోట్‌ను మంత్రివర్గం ముందు పెట్టడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. కాంగ్రెసు నాయకుడు దిగ్విజయ్ సింగ్‌ను ఎందుకు కలిశారో సిబిఐ డైరెక్టర్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే వైయస్ జగన్‌కు బెయిల్ వచ్చిందని ఆయన అన్నారు.

ఇంటి భోజనం కావాలని కోర్టులో పిటిషన్‌ వేస్తే సోనియా గాంధీ జగన్‌ను ఇంటికే పంపించారని ఆయన వ్యాఖ్యానించారు. దమ్ముంటే కేంద్ర సీమాంధ్ర మంత్రులు తెలంగాణ నోట్‌ను చించేసి తెలుగువారి పౌరషాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెటు సభ్యులు రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని ఆయన అన్నారు. లేదంటే సీమాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు.

అధికార పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణ రోడ్లు ఎవరికి వారికే ఉన్నాయని ఆయన అన్నారు. సమైక్యాంద్ర ఉద్యమాన్ని పలుచన చేసే విధంగా కాంగ్రెసు అధిష్టానం వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసల ఒప్పందం కారణంగానే విభజన జరుగుతోందని ఆయన అన్నారు.

సమైక్యాంధ్ర కోసం చివరి వరకు ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెసు నాలుగు నెలల పాటు అధికారంలో ఉంటుందని, ఈ నాలుగు నెలల పాటు అడ్డుకోగలిగితే విభజన ఆగిపోయినట్లేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+