షర్మిల కొత్త టార్గెట్ - నేరుగాబరిలోకి..!!

ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తిగా మారుతుంది. బిజెపి, టిడిపి, జనసేన కలిపి ఎన్డీఏ కూటమిగా పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి మరోకూటమిగా పోటీ చేస్తుంది. జగన్ సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగారు. ఇక ఇప్పుడు షర్మిల ఎన్నికల వేల కొత్త అస్త్రంతో ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు.

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు ప్రచారంలో భాగంగా బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో షర్మిల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే షర్మిల తాను ఎందుకు ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది అనే అంశాన్ని వివరించారు. కుటుంబంలో చీలిక రావటం బాధాకరమైనా పోటీ తప్పడం లేదన్నారు. తన చిన్నాన్న వివేక చివరి కోరిక మేరకే తాను కడప ఎంపీగా బరిలో నిలుస్తున్నానని చెప్పుకొచ్చారు. కడప వేదికగా ఇప్పటికే సీఎం జగన్ వివేక హత్య .. ఆరోపణ పైన స్పందించారు. వివేకాన్ని చంపింది ఎవరో కడప జిల్లా వాసులకి తెలుసని చెప్పుకొచ్చారు.

PCC chief YS Sharmila to begin election campaign in Kadapa may targets Aviansh

ఇక ఇప్పుడు షర్మిల తన ప్రచారంలో మరోసారి వివేక హత్యను ప్రధాన ప్రచారస్రంగా మలుచుకునే అవకాశం కనిపిస్తుంది. షర్మిల ప్రత్యర్థిగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి భూపేష్ రెడ్డిని ప్రకటించారు. మారుతున్న సమీకరణలో భాగంగా ఎంపీగా ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. షర్మిల బరిలోకి దిగటం ద్వారా కడప సీటు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అవినాశనం గెలిపించుకోవడం జగన్కు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. షర్మిల సైతం ఇక్కడి నుంచి గెలుపును సీరియస్ గా తీసుకుంటున్నారు. మూడు పార్టీల నుంచి పోటీ ఉండటంతో కడప ఓటర్లు ఏం తేల్చబోతున్నారనేది ఆసక్తిని పెంచుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+