విడివిడిగా కాంగ్రెస్ నివేదిక: వేర్వేరుగా లగడపాటి, గుత్తా

అయితే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నాయకులు తనకు అందజేసిన నివేదికలను జివోఎంకు ఒకే నివేదికలా పంపించానని ఆయన చెప్పారు. జివోఎంతో పాటు హోంమంత్రిత్వ శాఖకూ నివేదిక పంపించినట్లు ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజల ఆకాంక్ష నెరవేరాలని తాను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. అదేలా సాధ్యమని ప్రశ్నించగా, తాను అలా కోరుకుంటున్నానని ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడంతో పాటు సీమాంధ్ర ప్రజల మనోగతానికి అనుగుణంగా విభజన ఆగిపోవాలన్న ఆకాంక్ష తనకు ఉండదన్నారు. విభజన విషయంలో తమ పార్టీకి తప్ప మిగతా పార్టీలకు స్పష్టత లేదని అన్నారు. ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, రేపు మరో మాట మాట్లాడే పద్ధతి తమ పార్టీకి లేదని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరహాలో ఊసరవెల్లి వైఖరి కాదని అన్నారు. సిడబ్ల్యుసి, యుపిఎ భాగస్వామ్య పక్షాలు తీసుకున్న నిర్ణయం ప్రకారం, సంక్షోభం లేకుండా నిస్సంకోచంగా తమ పార్టీ, కేంద్రం వ్యవహారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
లగడపాటి, గుత్తా నివేదికలు
జివోఎంకు విజయవాడ ఎంపి లగడపాటి రోజగోపాల్, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిలు వేర్వేరుగా వ్యక్తిగత నివేదికలు ఇచ్చారు. విభజనతో జరిగే అన్యాయాల గురించి లగడపాటి తన నివేదికలో వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. గుత్తా రెండు పేజీల లేఖలో ఎనిమిది పాయింట్లతో విభజనపై ఇచ్చారు. హైదరాబాదు రాజధానిని మున్సిపల్ కార్పోరేషన్ వరకే పరిమితం చేయాలని, ఎపి భవన్‌ను తమకు ఇవ్వాలని, కృష్ణా జలాలు కేటాయించాలని తదితరాలను పొందుపర్చారు. కాగా, విభజనకు 371(డి)ని సవరించాల్సిన అవసరం లేదని టి కాంగ్రెసు అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications