పెద్దిరెడ్డి మౌనం వెనుక - ఆ నిర్ణయంతో మారిన లెక్కలు..!!
ఏపీలో స్థానిక ఎన్నికల రాజకీయం ఆసక్తగా మారుతోంది. కీలక పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ సీనియర్ల నియోజకవర్గాల్లో జరిగిన ఏకగ్రీ వాలతో సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయంగా మౌనం పాటిస్తున్నారు. పుంగనూరులో నామినేషన్ల సమయంలో చోటు చేసుకున్న ఘటనల తరువాత రాజకీయంగా లెక్కలు మారుతున్నాయి. ఈ సమయంలోనే కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా... మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డికి తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ సొంత నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దశాబ్దాల కాలంగా పుంగనూరును కంచుకోటగా మార్చుకున్న పెద్దిరెడ్డికి తాజా పరిణామాలు అంతు చిక్కటం లేదు. వైసీపీ అధికారం లో ఉన్న సమయంలో పుంగనూరులో టీడీపీకి నామినేషన్ అవకాశం లేకుండా అడ్డుకున్నారని.. ఇప్పుడు పెద్దిరెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే, నామినేషన్ల దాఖలు సమయంలో జరిగిన ఘర్షణల తరువాత పుంగనూరులో తాము పోటీకి దూరం గా ఉంటున్నామని పెద్దిరెడ్డి ప్రకటించారు. జగన్ సూచనలతో ఈ ప్రకటన చేసినట్లు పార్టీలో చర్చ జరిగింది. ఆ నిర్ణయంతో పెద్దిరెడ్డి పూర్తగా సైలెంట్ అయ్యారు.

పుంగనూరులో మారుతున్న రాజకీయం
ఇక, నియోజకవర్గంలో జరుగుతున్న జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ ఏకగ్రీవంగా గెలిచి పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టింది. 4 మండలాల్లో ఎంపీపీ స్థానాలను తెలుగుదేశం కైవసం చేసుకుంది. సోమల మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకుగాను 10, పులిచర్ల మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకుగాను 8, చౌడేపల్లి మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకుగాను 12, రొంపిచర్ల మండలంలో 8కి 8 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో.. ప్రస్తుత పరిణామాలు పెద్దిరెడ్డి కి పరీక్షగా మారుతున్నాయి. ఇక.. పంచాయితీ ఎన్నికల సమయంలో చోటు చేసుకునే రాజకీయం పైనా ఉత్కంఠ నెలకొంది. కాగా.. 2029 ఎన్నికల నాటికి డీలిమిటేషన్ చర్చ జరుగుతున్న వేళ పెద్దరెడ్డి తదుపరి రాజకీయ అడుగులు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో.. పుంగనూరు పైన పట్టు కోసం టీడీపీ పూర్తి స్థాయిలో పావులు కదుపుతున్న వేళ.. పెద్దిరెడ్డి నిర్ణయాలు ఎలా ఉంటాయనేది కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications
