2రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నాం: ట్యాపింగ్‌పై ఆపరేటర్లు, కాల్‌డేటాకు ఓకే
ఢిల్లీ/విజయవాడ: తాము రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నామని టెలికాం ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంలో గురువారం నాడు టెలికాం ఆపరేటర్లకు తాత్కాలిక ఊరట లభించింది.
కాల్ డేటా వివరాలు వారంలోగా ఇవ్వాలని, అయితే సీల్డు కవర్‌లో ఇచ్చిన వాటిపై నెల రోజుల తర్వాత విచారణ చేపట్టాలని విజయవాడ కోర్టును సుప్రీం ఆదేశించింది.

కాల్ డేటా వివరాలు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని టెలికాం ఆపరేటర్లు సుప్రీం కోర్టులో తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య తాము నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.
దీనిపై సుప్రీం స్పందిస్తూ.. వారంలోగా కాల్ డేటా వివరాలు సీల్డు కవరులో విజయవాడ న్యాయస్థానానికి ఇవ్వాలని ఆదేశించింది. మూడు వారాల తర్వాతే డేటాను ఓపెన్ చేయాలని ఆదేశించింది. నెల రోజుల తర్వాత విచారణ చేపట్టాలని విజయవాడ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications