ఒకేసారి రూ.50 వేలు: బాబు నిర్ణయం, బీజీ (పిక్చర్స్)

రాజమండ్రి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి రూ.50వేలు మాఫీ చేయాలని నిర్ణయించారు. రుణమాఫీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది. రూ.50 వేల వరకూ పంట రుణం ఉన్న రైతులకు ఆ డబ్బును పూర్తిగా ఒకేసారి బ్యాంకులకు చెల్లించాలని నిర్ణయించారు.

రూ.50వేల వరకు రైతు రుణాలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిబంధన పాటించరాదని కూడా సర్కార్‌ నిర్ణయించింది. ఎంత పొలం ఉంది, ఏ పంట వేశారన్న దానితో నిమిత్తం లేకుండా యాభైవేల రూపాయల లోపు పంట రుణం ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు నివాసంలో బుధవారం రాత్రి సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బుధవారం రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళ్లు, చేతులు లేని వారికి ఒక రకమైన శిక్షణ, అంధులకు మరో రకమైన శిక్షణ ఇలా వైకల్యాన్ని బట్టి వికలాంగుల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి, సమాజానికి ఉపయోగపడేలా చేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు గోదావరి పుష్కరాలు - 2015 పైన రివ్యూ సమావేశం నిర్వహించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి రూ.50వేలు మాఫీ చేయాలని నిర్ణయించారు.

చంద్రబాబు

చంద్రబాబు

రుణమాఫీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది. రూ.50 వేల వరకూ పంట రుణం ఉన్న రైతులకు ఆ డబ్బును పూర్తిగా ఒకేసారి బ్యాంకులకు చెల్లించాలని నిర్ణయించారు.

చంద్రబాబు

చంద్రబాబు

రూ.50వేల వరకు రైతు రుణాలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిబంధన పాటించరాదని కూడా సర్కార్‌ నిర్ణయించింది. ఎంత పొలం ఉంది, ఏ పంట వేశారన్న దానితో నిమిత్తం లేకుండా యాభైవేల రూపాయల లోపు పంట రుణం ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు నివాసంలో బుధవారం రాత్రి సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బుధవారం నాడు ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సచివాలయంలో భేటీ అయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బుధవారం నాడు ఐవైఆర్ కృష్ణారావు భేటీ అయ్యారు. పలు అంశాల పైన చర్చించారు.

సుజన

సుజన

కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి బుధవారం నాడు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన దృశ్యం.

అలాగే, కూరగాయల తోటలు, పండ్ల తోటలు, ఉద్యాన పంటలకు సంబంధించి ఎకరాకి రూ.10వేల వరకూ మాఫీ చేయాలని నిర్ణయించారు. గతంలో వీటికి రుణ మాఫీ వర్తింపచేయరాదని అనుకొన్నా తాజాగా ఆ నిర్ణయం మార్చుకొన్నారు. వీటికి మంజూరైన పంట రుణాలకూ మాఫీ వర్తింపచేస్తారు. ఇది కూడా రూ.లక్షన్నర పరిమితికి లోబడే ఉంటుంది. రూ.50 వేలు పైబడి రుణాలున్న వారికి తొలి విడతగా ఇరవై శాతం మొత్తం బ్యాంకులకు జమ చేస్తారు.

వారికి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిబంధన కూడా వర్తిస్తుంది. మిగిలిన రుణాన్ని వాయిదాల పద్ధతిలో ప్రభుత్వం బ్యాంకులకు జమ చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఈ నెల 20వ తేదీలోపు రైతులకు ఈ సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. అన్ని వివరాలు సమర్పించిన 43 లక్షల మంది రైతులకు తొలి విడతలో ఈ చెల్లింపులు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+