ప్రజలపైకి దూసుకెళ్లిన క్రేన్, ఒకరి మృతి (పిక్చర్స్)

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని జగదాంబ జంక్షన్‌లో ఓ క్రేన్ బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం క్రేన్‌కు బ్రేకులు ఫెయిల్ కావడంతో జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

క్రేన్ ప్రజలపైకి దూసుకెళ్లిన ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఐఎన్ఎస్ డేగాలో ఉద్యోగి. 21వార్డు తాడివీధికి చెందిన గురుగుమిల్లి జీవన్ కుమార్ (40) ఐఎన్ఎస్ డేగాలో స్ప్రే పెయింటర్‌గా పనిచేస్తున్ాడు. అతడికి భార్య మంగవేణి, తురు, కుమారుడు ఉన్నారు.

డిగ్రీ చదువుతున్న కూతురు హరిప్రియను కళాశాల వద్ద దించేసి విధులకు వెళ్లేందుకు జగదాంబ జంక్షన్ వైపు వచ్చాడు. రెడ్ సిగ్నల్ పడడంతో సిగ్నల్ పాయింట్ వద్ద బైక్ నిలిపాడు. జగదాంబ జంక్షన్ వైపు వచ్చిన క్రేన్ బ్రేక్‌లు ఫెయిలై బైక్‌ను ఢీకొట్టింది.

క్రేన్ సృష్టించిన బీభత్సం

క్రేన్ సృష్టించిన బీభత్సం

బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఓ క్రేన్ ప్రజల మీదికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సృష్టించిన దారుణం అత్యంత దయనీయంగా ఉంది.

నివ్వెరపోయిన జనం..

నివ్వెరపోయిన జనం..

క్రెన్ ప్రజల మీదికి దూసుకెళ్లడంతో జరిగిన బీభత్సాన్ని ఇలా నివ్వెరపోయి చూశారు. క్రేన్ డ్రైవర్ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు.

రాళ్లు వేసి క్రేన్‌ను ఆపారు..

రాళ్లు వేసి క్రేన్‌ను ఆపారు..

బ్రేక్‌లు ఫెయిలై ముందుకు దూసుకెళ్తున్న క్రేన్‌ను రాళ్లు వేసి ఆపారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

కారును కూడా లాక్కెళ్లింది...

కారును కూడా లాక్కెళ్లింది...

రెడ్ సిగ్నల్ పడడంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. కానీ బ్రేక్‌లు ఫెయిలైన క్రేన్ ముందుకు పరుగెత్తింది. తన వెంట ఓ కారును కూడా అది లాక్కెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+