వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ బిల్లు: ఘర్షణ పడ్డారు, తోసుకున్నారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ బిల్లును శానససభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాసనసభ ఆవరణలో ఘర్షణవాతావరణం నెలకొంది. శాసనసభ్యులు ప్రాంతాలవారీగా విడిపోయి తోసుకున్నారు. సీమాంధ్ర తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తెలంగాణ బిల్లు ప్రతులను చించేశారు, దగ్ధం చేసుకున్నారు.

సీమాంధ్ర శాసనసభ్యుల చర్యలను అడ్డుకోవడానికి తెలంగాణ శాసనసభ్యులు ప్రయత్నించారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు సీమాంధ్ర శాసనసభ్యులతో వాగ్వివాదానికి దిగారు. పరస్పరం తోసుకునే ప్రయత్నాలు చేశారు.

ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తమపై దాడి చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారి కమలాసన్ రెడ్డి స్పీకర్‌కు ఓ నివేదికను సమర్పించారు.

శాసనసభ 1

శాసనసభ 1

తెలంగాణ బిల్లు ప్రతనులను దగ్ధం చేస్తున్న సీమాంధ్ర శాసనసభ్యులు. టిడిపి సీమాంధ్ర శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులు తెలంగాణ బిల్లుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసనసభ 2

శాసనసభ 2

తెలంగాణ బిల్లు ప్రతిపాదనపై సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసనసభ 3

శాసనసభ 3

తెలంగాణ బిల్లు ప్రతులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తదితరులు దగ్ధం చేస్తూ ఇలా..

శాసనసభ 4

శాసనసభ 4

తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను సీమాంధ్ర శాసనసభ్యులు చించేశారు. ఆ రకంగా తమ ఆగ్రహాన్ని వ్యకర్తం చేశారు.

శాసనసభ 5

శాసనసభ 5

తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే చర్చను చేపట్టాలని బిజెపి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.

శాసనసభ 6

శాసనసభ 6

సీమాంధ్ర శాసనసభ్యులు చించేసిన తెలంగాణ బిల్లు ప్రతులను ఏరుకుంటున్న తెలంగాణ శాసనసభ్యుడు గంగుల కమలాకర్

శాసనసభ 7

శాసనసభ 7

తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చించేయడాన్ని సిపిఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసనసభ 8

శాసనసభ 8

సీమాంధ్ర టిడిపి శాసనసభ్యులు బిల్లు ప్రతులను చించేస్తే తెలంగాణ టిడిపి శానససభ్యులు మాత్రం వెంటనే బిల్లుపై చర్చను చేపట్టాలని స్పీకర్‌ను కోరారు.

శాసనసభ 9

శాసనసభ 9

సీమాంధ్ర, తెలంగాణ శాసనసభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న స్థితిలో కుర్చీలో ఇలా గాలిలోకి లేచాయి.

శాసనసభ 10

శాసనసభ 10

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చించేసి ఇలా గాలిలోకి ఎగిరేశారు.

శాసనసభ 11

శాసనసభ 11

తెలుగుదేశం సీమాంధ్ర శసనసభ్యులు దేవినేని ఉమామహేశ్వర రావు తదితరులు తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను ఇలా చించేశారు.

శాసనసభ 12

శాసనసభ 12

సీమాంధ్ర శాసనసభ్యుల చర్యలను అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారి చర్యలను తీవ్రంగా తప్పు పట్టారు.

శాసనసభ 13

శాసనసభ 13

కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి కిందపడిపోయారు.

శాసనసభ 14

శాసనసభ 14

సీమాంధ్ర, తెలంగాణ శాసనసభ్యుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

శాసనసభ 15

శాసనసభ 15

సీమాంధ్ర శాసనసభ్యుల తీరుపై తెలంగాణకు చెందిన ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి, కాంగ్రెసు శాసనసభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.

English summary
Seemandhra Telugudesam and YSR Congress party MLas tored and burnt Telangana draft bill copies in the premises of Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X