ఎస్పీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు వీరే (పిక్చర్స్)

విశాఖపట్నం: వివిధ కారణాల వల్ల ముగ్గురు మావోయిస్టులు తమకు లొంగిపోయినట్లు విశాఖపట్నం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. దళ నాయకత్వంతో విభేదాల కారణంగా, తీవ్రమైన అనారోగ్యం కారణంగా వారు లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన ఆ ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు గురించి శుక్రవారం వివరించారు.

తూర్పు విశాఖ జాయింట్ డివిజన్ ఏరియా కమిటీ సభ్యురాలు కొర్రా గాసి అలియాస్ పుల్యామి అలియాస్ జాస్సీ (27)తో పాటు కోరుకొండ మిలిషియా సభ్యులు బుటూరి అప్పారావు, వెలుసూరి లక్ష్మయ్య పోలీసులకు లొంగిపోయారు. కొర్రా గాసీ ఏరియా కమిటీ సభ్యురాలిగా పనిచేసినట్లు ఎస్పీ తెలిపారు.

2007 త్ర 2016 మధ్య కాలంలో ఆమె గాలికొండ ఎవోబి డాక్టర్‌గా ఆమె పనిచేసినట్లు తెలిపారు. కొన్ని రోజులు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో డాక్టర్ ట్రైనింగ్ పొందినట్లు ఆయన తెలిపారు. విశాఖలోని కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ, ముకుడుపల్లి గ్రామానికి చెందిన సత్యనానారాయణ కూతురు గాసీ అని ఆయన తెలిపారు.

ఇష్టం లేని పెళ్లి చేయడంతో...

ఇష్టం లేని పెళ్లి చేయడంతో...

చిన్న వయస్సులో ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల, విప్లవ గేయాలకు ఆకర్షితురాలై గాసీ మావోయిస్టుల్లో చేరినట్లు ఎస్పీ తెలిపారు. కొర్రా గాసీపై జిల్లాలో మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. గునుకురాయి ఎదురు కాల్పుల ఘటన, ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా కలెక్టర్ కిడ్నాప్ సంఘటన, జికె వీధి పిఎస్ పరిధిలో టిడిపి మండల స్థాయి నాయకుల కిడ్నాప్ ఘటన వంటి వాటిలో ఆమె పాల్గొన్నట్లు కేసులు నమోదయ్యాయి. ఆమెపై ప్రభుత్వం రూ.4 లక్షల రివార్డు ప్రకటించింది.

పలు అసాంఘిక కార్యకలాపాల్లో...

పలు అసాంఘిక కార్యకలాపాల్లో...

లొంగిపోయిన బుటారి అప్పారావు (45), అదే గ్రామానికి చెందిన వెలుసూరి లక్ష్మయ్య (30)లను మావోయిస్టులు బలవంతంగా వివిధ అసాంఘిక కార్యకలాపాల్లో ఉపయోగించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిద్దరికీ జీవనోపాధి కింద ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అదే విధగా కొర్రా గాసీపై ప్రకటించిన రూ.4 లక్షల రివార్డును ప్రభుత్వానికి నివేదించిన తర్వాత వారికి అందజేస్తామని చెప్పారు.

చాలా మంది లొంగుబాటు సిద్ధం..

చాలా మంది లొంగుబాటు సిద్ధం..

దళంలో ఇకా చాలా మంది ఉన్నారని, వారు కూడా త్వరలో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ఎస్పీ చెప్పారు. తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు కేవలం మందులు మాత్రమే ఇచ్చేవారని, మెరుగైన వైద్యం కోసం మైదాన ప్రాంతానికి వెళ్తే పోలీసులకు తెలిసిపోతుందని తమను నిర్బంధించారని కొర్రా గాసీ చెప్పింది.

తనలాగే చాలా మంది...

తనలాగే చాలా మంది...

తన మాదిరిగానే ఇంకా చాలా మంది తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కొర్రా గాసీ చెప్పారు. మీడియా సమావేశంలో ఓఎస్‌డి అట్టాడ బాపూజీ, జిల్లా ఆపరేషన్స్ ఎఎస్పీ కె సత్యనారాయమ, సిఆర్‌పిఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సత్యబీర్ సింగ్ పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+