బాబుకు ప్లానింగ్ ట్విస్ట్: మోడీని డైలమాలో పడేశారా?
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పొందేందుకు ఇంకా అర్హత సాధించలేదని ప్రణాళికా సంఘం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. టిడిపి ఎన్డీయేలో భాగస్వామి. ఈ నేపథ్యంలో ప్రణాళికా సంఘం నివేదిక ప్రధాని నరేంద్ర మోడీని డైలమాలో పడేసిందని అంటున్నారు. కొత్తగా ఏర్పడిన ఎపి రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, లోటు బడ్జెట్‌లో ఉండటంతో పాటు మిత్రపక్షం అధికారంలో ఉంది.
గత యూపీఏ ప్రభుత్వం మార్చి 2వ తేదీన ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రణాళికా సంఘానికి సిఫార్సు చేసింది. ఎపికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని సూచించింది. ఇదే విషయమై నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలోను ఫిబ్రవరి 21న ప్రకటన చేశారు. ఎపికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని సభలో ప్రకటించారు. అనంతరం ప్రణాళికా సంఘానికి సిఫార్సు చేశారు.

జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎపికి ప్రత్యేక హోదా హామీ నేపథ్యంలో కేంద్రం దానిపై దృష్టి సారించింది. ఎపితో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తోంది. బీహార్, రాజస్థాన్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళికా సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాల పైన నివేదిక ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు ఇవ్వవచ్చునని తెలిపింది.












Click it and Unblock the Notifications