మీరే పెద్ద దిక్కు- ఊ అనండి చాలు: సౌత్ హీరో చంద్రబాబుకు మోదీ ఫోన్: కోరిన పదవి ఇస్తాం
Chandrababu Naidu: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడుతున్న ఫలితాలు తెలుగుదేశం పార్టీలో జోష్‌ను నింపాయి. ఆ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ఇప్పటికే మూడొంతులకు పైగా సీట్లను సాధించింది ఈ రెండు చోట్ల కూడా.
ఈ నేపథ్యంలో- అనూహ్య పరిణామాలు ఏర్పాడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. 2019 నాటి ఎన్నికల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవి చూసింది వైఎస్ఆర్సీపీ.

అటు తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తోన్న నేపథ్యంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కోరినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి పదవి కావాలంటే అలాంటి పదవిని ఇస్తామనే ఆఫర్ పెట్టినట్లు సమాచారం.
దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి అతి పెద్ద దిక్కుగా నిలిచారు చంద్రబాబు నాయుడు. దక్షిణాదిన కంచుకోటగా భావించిన కర్ణాటకలో ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు బీజేపీకి. తమిళనాడు, కేరళల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ తప్పితే- ఇక మిగిలిన ఏపీలో 22 లోక్‌సభ స్థానాలను టీడీపీ తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది టీడీపీ.
దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం దాదాపుగా ఖాయమైంది. ఈ క్రమంలో కేంద్రంలో బొటాబొటి మెజారిటీ సాధించిన బీజేపీ/ఎన్డీఏ కూటమికి ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి తెలుగుదేశం పార్టీ మద్దతు అత్యవసరమైంది. ఫలితంగా- చంద్రబాబుతో నరేంద్ర మోదీ, అమిత్ షా మంతానలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications