'భోగాపురం' ప్రారంభం వేళ కొత్త రికార్డులు - ప్రధాని మోదీ కోసం ఇలా..!!
భోగాపురం విమానాశ్రయం ప్రారంభం వేళ పండుగ వాతావరణం ఏర్పడనుంది. ప్రధాని మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రారంభ వేడుక నిర్వహణ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రారంభ ఘట్టాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్ణయాలు జరుగు తున్నాయి. 13 వేల మంది గిరిజన కళా కారులతో థింసా నృత్య ప్రదర్శన.. రెండు లక్షల మంది తో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రారంభ వేళ కొత్త రికార్డులు నమోదు కానున్నాయి.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కోసం ప్రధాని మోదీ షెడ్యూల్ అధికారికంగా ఖరారు చేసారు.
విమానాశ్రయం ప్రారంభం వేళ మోదీకి ఘన స్వాగతం లభించనుంది. అదే విధంగా విమానాశ్రయ ప్రారంభ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా 13 వేల మంది గిరిజన కళాకారులతో థింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రదర్శన ఉండనుంది. గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పే విధంగా 13 వేల మంది తో నృత్యం ఏర్పాటు చేస్తున్నారు. వేదిక వద్దకు చేరుకునే క్రమంలో 20 నిమిషాల పాటు ప్రధానికి స్వాగతం..రోడ్ షో ఉంటాయి. మరో 22 నిమిషాలు..భోగాపురం ఎయిర్పోర్ట్ లో ప్రధాని సందర్శన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు
ప్రధాని మోదీ ఉదయం 10:45 గంటలకు - ప్రత్యేక విమానం లో దిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:45 - 10:50 - గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. 10:50 - 10:55 - కారు లో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. 10:55 - 10:58 - 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. 11:00 - 11:15 - భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 11:17 - 11:25 - టెర్మినల్ భవనం నుంచి ఓపెన్‌టాప్ జీప్‌లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. ఇక.. 11:30 - 12:55 - విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగ సభలో ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 1:05 - 1:10 - భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం తో మొత్తం 2 గంటల 25 నిమిషాలు ప్రధాని షెడ్యూల్ ఖరారు చేసారు.












Click it and Unblock the Notifications