పాలిట్రిక్స్: కుటుంబాలలో రాజకీయ చిచ్చు, ఎవరి దారి వారిది!
హైదరాబాద్/విజయవాడ: ఇటీవల తిరుపతిలో జరిగిన మహానాడుకు టిడిపి అసంతృప్త నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి హరికృష్ణ గైర్హాజరయ్యారు. మహానాడుకు గైర్హాజరుపై ఆయన మాట్లాడుతూ తనకు మహానాడు కంటే ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడం ముఖ్యమైన అంశమన్నారు.
ఆయన మహానాడుకు హాజరు కావాలనుకుంటే మూడు రోజులలో ఏదో ఒకరోజు హాజరు కావొచ్చు. కానీ ఆయన రాలేదు. దీంతో, ఆయన చంద్రబాబు పైన ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారనే వాదనలకు బలం చేకూరుతుంది. ఎప్పటికైనా హరికృష్ణ.. చంద్రబాబుకు దూరమేనని అంటున్నారు.
ఆయా కుటుంబాలలోని రాజకీయ విభేదాలను కొందరు వ్యక్తిగత స్థాయి వరకు తీసుకు వెళ్తే, మరికొందరు రాజకీయాల వరకే వాటిని పరిమితం చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబంలో రాజకీయ విభేదాలు తీవ్రంగానే ఉన్నాయని చెప్పవచ్చు.

మెగా కుటుంబంలో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ తమది కేవలం రాజకీయాల వరకే వేర్వేరు దారి అని, కుటుంబపరంగా మాత్రం ఒక్కటేనని ఇటు చిరంజీవి, అటు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంలోను వారసత్వ పోరు ఉందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. కేటీఆర్‌ను తెరపైకి తీసుకు వచ్చాక, హరీష్ రావు కొద్దిగా తగ్గారనే వాదనలు ఉన్నాయి.
రాజకీయ చిచ్చు!
ఎన్టీఆర్ కుటుంబంలో రాజకీయాల్లో ఒక్కొక్కరు ఒక్కో దారిలో ఉన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్‌లు టిడిపిలో కీలకంగా ఉన్నారు. హరికృష్ణ టిడిపిలో ఉన్నప్పటికీ ఆయన పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఇక, ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు.
వారసత్వం విషయంలో నారా లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్‌గా కొద్ది సంవత్సరాల క్రితం కనిపించింది. లోకేష్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో.. హరికృష్ణ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక, పురంధేశ్వరి... బాబుతో విభేదించి తొలుత కాంగ్రెస్‌లో, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆమె మొదటి నుంచి బాబుకు దూరం పాటిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబంలో రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయనే వాదనలు ఉన్నాయి.
ఇక, మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల రాజకీయదారులు వేరు. రాజకీయం వారి కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెట్టిందనే వాదనలు చాలాసార్లు వినిపించాయి. అందుకు, ఇరువురు ఏళ్ల పాటు ఒకే వేదిక పైన కనిపించక పోవడం కూడా కారణమైంది. అయితే, తమ మధ్య రాజకీయ విభేదాలే కానీ, కుటుంబం అంతా ఒక్కటేనని వారు ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చుకున్నారు.
కేసీఆర్ కుటుంబంలోను వారసత్వం విషయంలో అసంతృప్తి కనిపించిందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎక్కడా బయటపడలేదని చెప్పవచ్చు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కవిత మధ్య వారసత్వ పోరు కనిపించిందనే వాదనలు ఉన్నాయి. కానీ, కేటీఆర్ పేరు తెరపైకి వచ్చాక వారసత్వపోరు చల్లబడింది.
ఆనం సోదరుల మధ్య కూడా రాజకీయాలు చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డిలు తెలుగుదేశం పార్టీలో ఉంటే, ఆయన సోదరుడు ఒకరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై ఆనం సోదరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
-
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో టైమ్ లీక్.. ఇక రచ్చ రచ్చే.. -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
చిరంజీవి ‘ఠాగూర్’ సినిమా విషయంలో జరిగిన పెద్ద గొడవ ఏంటి? -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
2001 సంక్రాంతికి చిరు - బాలయ్య అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధం! -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’












Click it and Unblock the Notifications