రాజధాని భూమిపూజకు ఎన్నికల కోడ్ అడ్డంకి, బాబు డైలమా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి మరో మూడు నాలుగు రోజుల్లో భూమి పూజ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధపడింది. అయితే, భూమి పూజకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా వస్తోంది. ఈ నేపథ్యంలో భూమిపూజ, బహిరంగ సభలకు ఏపీ ప్రభుత్వం ఈసి అనుమతి కోరింది.

12 లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో ఈ నెల 6వ తేదీన ఉదయం గం.8.49 నిమిషాలకు భూమి పూజకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది.

ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో.. భూమిపూజకు, బహిరంగ సభకు అనుమతించాలని ఈసీని కోరింది. జూన్ 5న అగ్రికల్చరల్ యూనివర్సిటీకి పునాది రాయి వేయనున్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్ జిల్లాల్లో ప్రజాప్రతినిధులు జన్మభూమిలో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కోడ్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Poll code may hit capital

జగన్‌, కేసీఆర్‌ ఫ్లెక్సీల దహనం

జగన్‌ దీక్షను నిరసిస్తూ విశాఖలో టీడీపీ కార్యకర్తల నిరసన ఉద్రిక్తలకు దారి తీసింది. జగదాంబ జంక్షన్‌లో జగన్, కేసీఆర్‌ ఫ్లెక్సీ దహనానికి టీడీపీ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు అని తెలియక సివిల్‌ యూనిఫామ్‌లో ఉన్న కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. చివరికి నేతలు, ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+