జగన్ ప్రతినిధిలా: కెసిఆర్‌ను ఏకిపారేసిన పొన్నాల
హైదరాబాద్: తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఏకిపారేశారు. తెరాసను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెరాసను చీలుస్తానని తాను ఎక్కడా చెప్పలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తెరాసను చీలుస్తానని తాను ఎక్కడ చెప్పానో కెసిఆర్ చెప్పగలరా అని ఆయన అడిగారు. భయంతోనే కెసిఆర్ అలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని కూడా పొన్నాల అన్నారు. కెసిఆర్‌లా మాట్లాడడానికి తనకు చదువు, సంస్కారం అడ్డు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని అన్నారు.

కెసిఆర్ అంచనాలు ఎప్పుడూ నిజం కాలేదని ఆయన అన్నారు. కెసిఆర్ నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ ఎప్పుడు ఏమంటారో ఎవరికీ తెలియదని అభిప్రాయప్డడారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట మార్చింది కెసిఆరేనని ఆయన అన్నారు.
కెసిఆర్ తీరు ఉట్టికెక్కలేనమ్మ శాపనార్థాలు పెట్టిందన్నట్లుందని ఆయన అన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ నేతలను ఢిల్లీ తీసుకెళ్తామని చెప్పడాన్ని క్యాంపులు పెట్టడం కాకుండా ఏమంటారని ఆనయ అడిగారు కెసిఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధిగా జగన్ ముఖ్యమంత్రి అవుతారని ప్కరటించారని ఆయన అవహేళన చేశారు. తన పనితీరు చూసి కెసిఆర్ సహించలేకపోతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications