ఉదయ్ కిరణ్ ఆత్మహత్య: ఆ రోజంతా ఏమీ తినలేదు

హైదరాబాద్: సినీనటుడు ఉదయ్ కిరణ్‌ది ఆత్మహత్యేనని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు. ఈ మేరకు పోస్ట్‌మార్టం నివేదిక సిద్ధం చేశారు. వైద్యుల నివేదిక ప్రకారం ఉదయ్‌కిరణ్ రాత్రి 10 నుంచి 12 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరి వేసుకున్న కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్న రోజు ఉదయం నుంచి ఉదయ్ కిరణ్ ఆహారం తీసుకోలేదని, బట్టతాడుతో ఉరివేసుకున్నట్టు పోస్టుమార్టంలో తేలింది.

కాగా ఉరివేసుకునే ముందు ఉదయ్ కిరణ్ రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు ఫోరెన్సిక్ ప్రాథమికలో వెల్లడైంది. ఆయన తన చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకునే ప్రయత్నం చేశారని నివేదికలో తేలింది. వెస్ట్‌జోన్ పోలీసులు మంగళవారం ఉదయ్‌కిరణ్ నివాసాన్ని పరిశీలించి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించారు.

Post Mortem report: Uday Kiran committed suicide

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ ఫోరెన్సిక్ నివేదికలో ఆత్మహత్యగా తేలింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. రెండు మూడు రోజుల్లో భార్య విషిత, అత్తమామలను విచారించనున్నట్లు తెలిసింది.

ఉదయ్‌కిరణ్, విషిత కాల్‌డేటాను పోలీసులు తెప్పించి పరిశీలించినట్లు తెలుస్తోంది. విషిత ఫోన్ నుంచే ఎస్ఎంఎస్‌లు వచ్చినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు స్నేహితులతో ఉదయ్ మాట్లాడినట్లు పోలీసులు నిర్దారించారు. చెన్నై, హైదరాబాద్‌లోని మిత్రులతో సంభాషించారని, కొందరు స్నేహితులకు ఎస్ఎమ్ఎస్‌లు పంపినట్లు తెలుస్తోంది. ఉదయ్‌కిరణ్ చనిపోయిన తర్వాత భార్య,మామ, చెన్నై స్నేహితుడు గోపాల్ నుంచి కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+