జగన్‌కు అమరావతిలోని ఆ ఊర్లో గట్టి ఝలక్, అనుమతిపై హోంమంత్రి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు షాకిచ్చారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు షాకిచ్చారు. ఈ రోజు (గురువారం) జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటించారు.
అయితే, పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి. జగన్ గో బ్యాక్ అంటూ కురగల్లు తదితర ప్రాంతాల్లో రైతులు బ్యానర్లు కట్టారు. రైతులలో విషబీజాలు నాటేందుకు జగన్ అమరావతిలో పర్యటిస్తున్నారని వారు మండిపడ్డారు.

అనుమతి లేకుంటే ఊరుకోం: చినరాజప్ప
అనుమతులు లేకుండా పాదయాత్రలు చేస్తే ఊరుకునేది లేదని ఏపీ హోంమంత్రి చినరాజప్ప గురువారం మండిపడ్డారు. వెంటనే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన హితవు పలికారు.
వైసిపి అధినేత వైయస్ జగన్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని నిప్పులు చెరిగారు. రాజధానిలో పర్యటిస్తూ ఇటు ప్రజలను, అటు రైతులను రెడ్డగొడుతున్నారని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications