టీడీపీ,జనసేన "పవర్" ఫుల్ హామీలు - రుణమాఫీ అస్త్రం..!!

ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని సీఎం జగన్..అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు, పవన్ పట్టుదలతో ఉన్నారు. బీజేపీ తమతో కలిసి రావాలని ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నా ఇంకా కమలం పార్టీ నుంచి స్పష్టత రాలేదు. ఈ సమయంలో జగన్ ను ఎదుర్కోవాలంటే అంతకు మించి సంక్షేమం ఇవ్వాలని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. అందులో భాగంగా కీలకమైన రెండు హామీల ప్రకటనకు సిద్దమవుతున్నాయి.

కీలక హామీలు
అధికారంలో వచ్చిన సమయం నుంచి అమలు చేస్తున్న సంక్షేమం తిరిగి తనకు అధికారం ఇస్తుందని జగన్ విశ్వసిస్తున్నారు. జగన్ ను ఓడించాలంటే సంక్షేమ ఓట్ బ్యాంక్ తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు - పవన్ భావిస్తున్నారు. రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో పైన ముసాయిదా సిద్దం చేసాయి. మహానాడు వేదికగా చంద్రబాబు సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించారు.

Power to the People:TDP Janasena Vows Free Electricity and Loan Waiver in combined Election Manifesto

కానీ, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. వీటిని కొనసాగిస్తూ..జనసేన పేర్కొన్న ఆరు ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో చేర్చేందుకు నిర్ణయించారు. వీటితో పాటుగా మెజార్టీ ఓట్ బ్యాంక్ తమ వైపు తిప్పుకొనే విధంగా.. తాజాగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని ప్రధాన హామీలను తమ మేనిఫెస్టోలో చేర్చేందుకు ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి.

ఉమ్మడి మేనిఫెస్టో
మేనిఫెస్టోలో రెండు ప్రధాన అంశాలను చేర్చనున్నట్లు తెలుస్తోంది. పేదలకు ఉచిత గృహ విద్యుత్‌ అందించాలన్న యోచనలో ఉన్నాయి. కర్ణాటక తరహాలో ఆ అస్త్రాన్ని ఏపీలో కూడా సంధించాలని టీడీపీ - జనసేన పార్టీలు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెల్ల రేషన్‌ కార్డ్‌ కలిగిన పేదలు, ముఖ్యంగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగదారులకు ఒక వరాన్ని ప్రకటించాలని భావిస్తున్నాయి.

ప్రస్తుతం విద్యుత్‌ బిల్లులు మోతమోగుతున్న పరిస్థితుల్లో ఈ అస్త్రం తమ పార్టీలకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తుందోనన్న భావనలో ఆ పార్టీలు ఉన్నాయి. రైతు రుణమాఫీ హామీని ఇవ్వాలన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చాయి. ఇంకోవైపు ఉద్యాన రైతులకు ఇప్పటికే హామీని జనసేన ఇచ్చింది. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు అంశాన్ని స్పష్టం చేసింది.

కలిసొచ్చేదెవరికి
2014 లో ఇదే హామీ ఇచ్చి విఫలం కావటంతో ఈ సారి లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ రెండు లక్షల రూపాయాల రుణ మాఫీ హామీతో అధికారంలోకి వచ్చింది. దీంతో పాటు రైతులకు మేలు చేసే ఇతర అంశాలను మేనిఫెస్టోలో చేర్చేలా నిర్ణయం చేస్తున్నారు. అయితే, నాడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు అమలు చేయలేదనే అంశాన్ని నాడు పాదయాత్ర నుంచి ఇప్పటి వరకు జగన్ ప్రతీ సభలోనూ ప్రస్తావన చేస్తున్నారు.

టీడీపీ, జనసేన ఇచ్చే హామీలు అమలు కావని వివరిస్తున్నారు. తాను చెప్పిన ప్రతీ మాట అమలు చేసానని గణాంకాలతో విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ఎన్నికలకు ముందే రుణమాఫీ చేస్తారనే ప్రచారం వైసీపీలో ఉంది. దీంతో..ఎన్నికల వేళ ఈ హామీలు..జగన్ నిర్ణయాలు ఎవరికి మేలు చేస్తాయనేది ఆసక్తిగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+