‘రాధ’ కేసులో భర్తే కిరాతకుడు.. గూగుల్ టేకౌట్ తో నిర్థారణ

వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కోట రాధ(35) హత్యకేసు చివరి దశకు వచ్చింది. భార్యను తానే హత్య చేశానని ఆమె భర్త మోహన్‌ రెడ్డి పోలీసు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. మోహన్ రెడ్డి ఒక్కడే హత్య చేశాడా? లేదంటే అతనికి ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

తన స్నేహితుడు కాశిరెడ్డికి భారీ మొత్తంలో రుణం ఇప్పించిన రాధ.. వాటిని తిరిగి రాబట్టలేకపోయింది. ఈ వ్యవహారం కుటుంబంలో కలతలకు దారితీసింది. ఈ క్రమంలోనే భార్యను హత్యచేయాలని మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. రెండు వారాల నుంచి సెల్ ఫోన్ సందేశాలతో నాటకమాడాడు. సొంత ఊరిలో నిర్వహించే చౌడేశ్వరీ దేవి కొలుపులకు రాధ పుట్టింటికి వచ్చింది. ఈ అవకాశాన్ని తనకు సానుకూలంగా మోహన్ రెడ్డి మలచుకున్నాడు. కాశిరెడ్డి పేరుతో సిమ్‌ కార్డులు కొనుగోలు చేసి, ఆ పేరుతో భార్య ఫోన్ కు మెసేజ్ లు పంపిస్తూ ఛాటింగ్‌ చేశాడు. ఈ విషయాన్ని రాధ గ్రహించలేకపోయింది.

radhamurdercase

* వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు ఫోన్ల నుంచి మోహన్ రెడ్డి వారం రోజులుగా తన భార్యతో ఛాటింగ్ చేశాడు.
* హత్య జరిగిన ఈ నెల 17వ తేదీన కూడా కొద్దిగంటల ముందు సూర్యాపేటలో ఇలాంటి సందేశాలే పంపించాడు.
* తన ఫోన్ పనిచేయడంలేదని చెప్పి ఒక చెరకు రసం బండి నడిపే వ్యక్తి నుంచి ఫోన్ తీసుకొని సిమ్ కార్డు వేసి కాశిరెడ్డి పేరుతో మెసేజ్ లు పంపించాడు.
* పల్నాడు జిల్లా వినుకొండలో ఓ టీ దుకాణం వద్ద మరొక వ్యక్తి నుంచి సెల్ తీసుకొని తన సిమ్ వేశాడు. అందులో సాయంత్రం 3.00 గంటలకు కనిగిరి వస్తానంటూ మెసేజ్ చేశాడు.

* కనిగిరి వచ్చి పామూరు బస్టాండ్‌ సెంటర్ లో కంభం వెళ్లే యువతితో మాటలు కలిపాడు. ఆమె ఫోన్ తీసుకొని మరో మెసేజ్ చేశాడు.. తాను కనిగిరి వచ్చానని. నిజంగానే కాశిరెడ్డి వచ్చాడని భావించిన రధ కనిగిరికి చేరుకుంది.
* రాధ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వేచిచూసిన పోలీసులు తర్వాత కోదాడలో మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
* పోలీసుల విచారణతో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. అయితే రాధ శరీరంపై ఉన్న గాయాలను పరిశీలిస్తే మరికొందరు హత్యలో పాల్గొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తానొక్కడే ఈ ఘాతుకం చేసినట్లు మోహన్ రెడ్డి చెప్పాడు.
* కాశిరెడ్డిపై రాధ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో అక్కడే ఉన్న మోహన్ రెడ్డి తనకేమీ తెలియనట్లుగా ఉండిపోయాడు. కాశిరెడ్డే హత్య చేసివుంటాడంటూ పోలీసులను కూడా నమ్మించాడు. రాధ మరణం తర్వాత అనుమానాస్పదంగా ఉన్న తన ప్రవర్తనపై పోలీసులు నిఘా పెట్టినట్లు మోహన్ రెడ్డి కనుక్కోలేకపోయాడు. గూగుల్ టేకౌట్ ద్వారా హత్య జరిగిన సమయంలో నిందితుడు కనిగిరిలోనే ఉన్నట్లు గుర్తించారు. హత్య జరిగిన రోజు తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ గట్టిగా చెప్పడం కూడా పోలీసుల్లో అనుమానం రేకెత్తడానికి కారణమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+