ఏపీలో సంక్షేమం పై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమం పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలోని పరిస్థితుల పై ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రశాంత్ కిషోర్ సంక్షేమ కార్యక్రమాలు ఉండాల్సిందే అని స్పష్టం చేసారు. అదే సమయంలో సంపద సృష్టించి అందులో నుంచి కొంత పంపిణీ చేయాలన్నారు. సమాజంలో సంపద పెరిగే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాని సూచించారు. అప్పుడే మన భావితరాలకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు.
ఏపీలో సంక్షేమంపై ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారు..!!#PrashantKishor #YSJagan #CMJagan #YSJaganGovt #YSJaganRegime #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/V1e8lnKfEO
— oneindiatelugu (@oneindiatelugu) October 30, 2023
సంక్షేమం - సంపద:వైసీపీతో సహా పలు పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఏపీలో పరిస్థితుల ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సంపద సృష్టించకపోతే..డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంచుతారని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. సంపద సృష్టించే వాతావరణం సమజాంలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసారు. సంపద సృష్టికి ప్రభుత్వాలే సహకరించకపోతే పంచటానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని వ్యాఖ్యానించారు.

అప్పులకు దారి తీస్తుంది:ఈ పరిస్థితి అపరమితంగా అప్పులు చేసే పరిస్థితి దారి తీస్తుందని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తేనే దాన్ని పంచగలమని ప్రశాంత్ కిశోర్ చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్త గా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించారు. వ్యూహాలతో పాటుగా పథకాల ప్రకటన విషయంలోనూ సూచనలు సలహాలు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రశాంత్ కిశోర్ రాజకీయంగా వైసీపీకి దూరమయ్యారు.
ఆ తరువాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో టీఎంసీ, డీఎంకే కోసం రాజకీయ వ్యూహకర్తగా పని చేసారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ మమతా, స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఒక రాజకీయ వ్యూహకర్తగా కొనసాగటం లేదని ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. పూర్తిగా బీహార్ రాజకీయాలకే ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ పరిమితం అయ్యారు.

వైరల్ అవుతున్న వ్యాఖ్యలు:ఇప్పుడు తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ..మరి నెలల్లో ఎన్నికలు జరగనున్న ఏపీలో సంక్షేమం చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. సంక్షేమ ఓట్ బ్యాంక్ పూనే ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకుంటున్నాయి. ఈ సమయంలో సంక్షేమం - సృష్టి పైన ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణం అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం..












Click it and Unblock the Notifications