టిటిడి డిక్లరేషన్: జగన్‌కిలేని ఒత్తిడి జయసుధపై పెట్టారా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ సికింద్రాబాద్ శాసన సభ్యురాలు, ప్రముఖ నటి జయసుధ పర్యటన కూడా చర్చనీయాంశమవుతోంది.
డిక్లరేషన్ కోసం జయసుధ పైన తిరుమల తిరుపతి సిబ్బంది ఒత్తిడి చేసినట్లుగా చెబుతున్నారు. టిటిడి సిబ్బంది ఒత్తిడితోనే తాను డిక్లరేషన్ పైన సంతకం చేశానని జయసుధ చెప్పినట్లుగా తెలుస్తోంది. టిటిడి కార్యాలయం ఎక్కడుందో తనకు తెలియదని, తనంతట తానే వెళ్లి ఎందుకు సంతకం చేస్తానని ఆమె ప్రశ్నించారు. ఒత్తిడి వల్లే తాను సంతకం చేశానని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తిగా కనిపించేందుకు తాను ఏమైనా తీవ్రవాదినా అన్నారు.

అయితే, జయసుధ పైన ఎవరు కూడా డిక్లరేషన్ మీద సంతకం చేయాలని ఒత్తిడి చేయలేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గోపాల్ చెప్పారు. తిరుమలలో ఎవరైనా సంప్రదాయాలను పాటించాల్సిందేనని ఆయన చెప్పారు. జగన్ పర్యటన పైన గవర్నర్ నివేదిక కోరితే తాము ఇచ్చామని చెప్పారు.
గవర్నర్ తదుపరి ఆదేశాలతో తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగన్ డిక్లరేషన్ అవసరం లేదని తాము భావించామని, జగన్ సంప్రదాయ దుస్తుల్లోనే శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పారు. నిత్యం ఎంతోమంది ఇతర మతస్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారన్నారన్నారు. అనుమానం వస్తేనే డిక్లరేషన్ పైన సంతకం చేపిస్తామన్నారు.
కాగా, తిరుమలలో ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని, జగన్ నిబంధనలు ఉల్లంఘించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నేత భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ మతం ఏమిటో ఈవోకు తెలియదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications