టీటీడీకి కీలక సూచనలు చేసిన చంద్రబాబు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు.
వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో చంద్రబాబుకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి చంద్రబాబు స్వామి వారి పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంగనాయకుల మండపం నుండి భక్తులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. తిరుమల పవిత్రత, పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం స్వామివారు పలుమార్లు ప్రసాదించారని గుర్తు చేశారు. అలిపిరి ఘటనలో తన ప్రాణాలను రక్షించడం కూడా ఆయన సంకల్పమేనని గాఢంగా విశ్వసిస్తున్నానని అన్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాల కిందట ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం ఇప్పుడు అనేక రెట్లు విస్తరించిందని, ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సేవను అన్ని టీటీడీ ఆలయాలకు విస్తరించాలని టిటిడి చైర్మన్, బోర్డు సభ్యులు, అధికారులను ఆయన కోరారు.
5,000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 29 రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని, వివిధ దేశాల్లో శ్రీవారి భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ వాటిని నిర్మించాలని సూచించారు. శ్రీవారిని ప్రపంచ వ్యాప్తంగా ఆరాధించే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, దీనికి దాతలు విస్తృతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఎస్‌వి ప్రాణదాన ట్రస్ట్ కు ఇప్పటివరకు రూ.709 కోట్లు విరాళంగా వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు, అవసరమైన రోగులకు వైద్య సహాయంగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో వైద్య సౌకర్యాలను అభివృద్ధి చేయాలని టీటీడీని కోరారు.
-
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications