ఒకే జైలులో వంశీ,పీఎస్సార్ : ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే, నాడు- నేడు ..!!

విజయవాడ కేంద్రంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వల్లభనేని వంశీ ఇప్పటి కే జైలులో ఉన్నారు. కాగా, తాజాగా ముంబాయి నటి కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి మాజీ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులుకు కోర్టు రిమాండ్ విధించింది. లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డిక రిమాండ్ విధించటంతో.. ఈ ముగ్గురూ ఇప్పుడు విజయవాడ జైలులో ఉన్నారు. కాకతాళీ యమే అయినా... గతంలో వంశీ - పీఎస్సార్ మధ్య విభేదాలను విజయవాడ వాసులు గుర్తు చేసు కొంటున్నారు.

ఒకే జైలులో
ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ముంబాయి నటి కేసులో రిమాండ్ విధించటంతో విజయవాడ జైలు లో ఉన్నారు. అక్కడ రిమాండ్‌ ఖైదీగా నెం. 7814ను కేటాయించారు. మద్యం కుంభకోణంలో అరెస్టై రిమాండ్‌ నిమిత్తం విజయవాడలోని జిల్లా కారాగారానికి వెళ్లిన రాజ్‌ కసిరెడ్డికి జైలు అధికారులు 7813 నెంబరు కేటాయించారు. వీరికి భద్రత దృష్ట్యా జైలు నిబంధనల మేరకు సింగిల్‌ సెల్‌లు కేటాయించారు. కసిరెడ్డిని ఒకటో బ్యారెక్‌లోని సెల్, సీతారామాంజనేయులుకు రెండో బ్యారక్‌లోని సెల్‌లో ఉంచారు. ఇతరులతో కలపకుండా భద్రతను దృష్టిలో పెట్టుకుని వారిని ఒంటిరిగానే ఉంచారు. తనకు ప్రత్యేకంగా సదుపాయాలు వద్దని, అందరిలా చూడమని పీఎస్‌ఆర్‌ చెప్పినట్లు సమచారం. రాజ్‌ కెసిరెడ్డి మాత్రం తనకు నడుం నొప్పి ఉందని జైలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

psr-anjaneyulu-and-vamsi-in-vijayawada-jail-in-different-cases

జైలులో పీఎస్సార్
రిమాండ్‌ కోసం జైలుకు సీతారామాంజనేయులు వెళ్లినప్పుడు తనతో పాటు పూజకు కావాల్సిన వస్తువులను కూడా తీసుకెళ్లారు. తొలుత వీటిని జైలు అధికారులు సెల్‌లోకి తీసుకెళ్లేందుకు అనుమతించలేదు. పూజకు అనుమతించాలని పీఎస్‌ఆర్‌ కోరారు. ఇంతలో జైలు తనిఖీకి వచ్చిన డీఐజీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరారు. ఇక.. ఇదే సమయంలో మరో ఆసక్తి కర అంశం విజయవాడలో చర్చ జరుగు తోంది. గతంలో సీతారామాంజనేయులు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన సమయంలో వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నారు.

Take a Poll

వంశీ - పీఎస్సార్ మధ్య వివాదాలు
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయం అది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పలు అంశాలపై వివాదాలు నడిచాయి. దీంతో ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్‌ పొడిగింపు కోసం వంశీ, ముంబయి నటి కేసులో ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు బుధవారం ఒకే సమయంలో ఒకే కోర్టుకు వచ్చారు. నటి కేసులో వాదనలు పూర్తయి తీర్పు కోసం పీఎస్‌ఆర్‌ ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో రిమాండ్‌ పొడిగింపు కోసం వంశీ వచ్చారు. అనంతరం ఇద్దరూ ఒకే జైలుకు వెళ్లారు. నాడు పీఎస్సార్ పైన వంశీ తీవ్ర ఆరోపణలు చేసారు. పీఎస్సార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని అప్పట్లో ఫిర్యాదు చేసారు. ఆ తరువాత పీఎస్సార్ బదిలీ పైన హైదరాబాద్ వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+