అద్వానీతో పురంధేశ్వరి: నిన్నసోనియాతో, నేడు సుష్మతో
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీని కలిశారు. నిన్నటి వరకు పదేళ్ల పాటు కాంగ్రెసు పార్టీలో ఉండి, కేంద్రమంత్రిగా ఉన్న పురంధేశ్వరి సోనియా గాంధీకి సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడు బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌తో కలిసి నవ్వులు పంచుకున్నారు.
సుష్మా స్వరాజ్, పురంధేశ్వరి, వెంకయ్య నాయుడులు అద్వానీ నివాసానికి వెళ్లారు. అద్వానీకి పురంధేశ్వరి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. ఆమె పార్టీలో చేరినట్లే. కాగా, హైదరాబాదులో రాష్ట్ర పార్టీ నాయకుల సమక్షంలో పురంధేశ్వరి బిజెపిలో చేరుతారని వెంకయ్య నాయుడు చెప్పారు.

పురంధేశ్వరి చేరికపై బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పందించారు. బిజెపితో కలిసి పని చేసేందుకు పురంధేశ్వరి రావడం సంతోషించదగ్గ పరిణామం అన్నారు. పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాక ఆమె లాంఛనంగా తమ పార్టీలో చేరుతారని చెప్పారు. దేశ ప్రజలకు ఇప్పుడు బిజెపి మాత్రమే ఆశాజ్యోతిగా కనిపిస్తోందన్నారు.
తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి క్రమంగా మద్దతు పెరుగుతోందని వెంకయ్య నాయుడు చెప్పారు. కాగా, తాను బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పురంధేశ్వరి గురువారం చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications