భారతీ రెడ్డి పేరుతో సాక్షికి రఘురామ నోటీసులు : క్షమాపణ చెప్పాలి : 50 కోట్ల పరువునష్టం..!!
ముఖ్యమంత్రి జగన్ కుటుంబం మేనేజ్ మెంట్ లో నడుస్తున్న సాక్షి మీడియా గ్రూపుకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు లీగల్ నోటీసులు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే సాక్షి యాజమాన్యంకు రఘురామ తరపు న్యాయవాది నోటీసులు ఇచ్చారు. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా అనేక కథనాలు ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, వారం రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ఆ నోటీసలో పేర్కొన్నారు.

మరోసారి భారతీరెడ్డి పేరుతో నోటీసులు..
మరలా ఈ రోజు ఇచ్చిన నోటీసులోనూ తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బేషరతు క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. పదిహేను రోజుల్లో నోటీసుకు సమధానం ఇవ్వకుంటే.. 50 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ హెచ్చరించారు. ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ భారతీ రెడ్డితో సహా సాక్షి మీడియాలో కీలక స్థానాల్లో ఉన్న పలువురి పేర్లతో నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసుతో పాటుగా తన పైన ప్రసారమైన కధనాలను సైతం జత చేసినట్లు సమాచారం. రఘురామ రాజు వైసీపీ అధినాయకత్వం పైన విమర్శలు ప్రారంభించిన సమయం నుండి వైసీపీ నేతలు ఆయన్న టార్గెట్ చేసారు.

సీఐడీ కేసుతో తారా స్థాయికి..
రఘురామ పైన తాజాగా సీఐడి సెమోటోగా కేసు నమోదు..ఆ తరువాత కస్టడీలో తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ రఘురామ ఫిర్యాదులు చేస్తూ లేఖలు రాసారు. ఇప్పుడు వరుసగా సీఎం జగన్ కు లేఖలు రాస్తున్నారు. అయితే, రఘురామ రాజు మీడియా సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసి..ఆయనతో కలిసి కుట్ర చేసాయంటూ రెండు మీడియా సంస్థల పైన సీఐడి రఘురామ కేసులో అభియోగాలు మోపింది. రఘురామ రాజు మరో వైపు సాక్షి లక్ష్యంగా నోటీసులు ఇస్తున్నారు.
Recommended Video

ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా..
మరి...ఇప్పుడు రఘరామ నోటీసుల పైన సాక్షి యాజమాన్యం స్పందిస్తుందా.. ఏ రకంగా సమాధానం ఇస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. రఘురామ రాజు పైన తాము రెండో సారి ఫిర్యాదు చేసిన తరువాత స్పీకర్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని..త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ అవుతాయనే నమ్మకం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. కానీ, రఘురామ రాజు మాత్రం తన పైన అనర్హత వేటు పడదనే ధీమాతో కనిపిస్తున్నారు. ఇలా ఎవరి నమ్మకంతో వారున్న ఈ సమయంలో చోటు చేసుకొనే రాజకీయ పరిణామాలు కీలకంగా మారనున్నాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications