వైసిపిలోకి వెళ్తే: ఆనం, సిఎంను అవమానించేలా వెంకయ్య: రఘువీరా, బాబుపై విజయసాయి
గుంటూరు: తాను అసంతృప్తిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి శుక్రవారం అన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఒరిగేదేమి లేదని చెప్పారు.
మా వల్లే ఎన్టీఆర్ ఫోటో పెట్టాలనే ఆలోచన: జ్యోతుల
కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలు గందరగోళం సృష్టిస్తున్నాయని వైసిపి నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. తమ వల్లే ఎన్టీఆర్ ఫోటో పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందని చెప్పారు.
ముఖ్యమంత్రిని అవమానించేలా: రఘువీరా రెడ్డి
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని అవమానించేలా ఉన్నాయని, ప్రజలను నిరాశపరిచేలా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి శుక్రవారం అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపాలన్నారు.
విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే చంద్రబాబు రైతుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. ప్రయివేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్మే బాధ్యత వహించాలన్నారు.

బాబు భయపడుతున్నారు: విజయ సాయి రెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే గ్రాంట్ల రూపంలో 56.25 శాతం అధికంగా వస్తాయని, పన్ను రాయితీలు ఉంటే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైసిపి నేత విజయ సాయి రెడ్డి విశాఖలో అన్నారు. అలాంటప్పుడు ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ఎలా బాగుంటుందో చంద్రబాబు చెప్పాలన్నారు. హోదా అడిగితే కేంద్రంతో సంబంధాలు తెగిపోతాయనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు.
భూమి పిచ్చి: రామకృష్ణ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు భూమి పిచ్చి పట్టుకుందని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. నూతన రాజధాని ప్రాంతంలో ఇప్పటికే సేకరించిన భూమి చాలదన్నట్లు ఇంకా సేకరిస్తూనే ఉన్నారన్నారు. కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే భూమిని సేకరిస్తున్నారన్నారు.
రాజధాని, ఇతర అవసరాలకు ఎంత కావాలో చంద్రబాబు చెప్పాలన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి రెండువేల ఎకరాలు అవసరమైతే 15,200 ఎకరాలు సేకరించారని మండిపడ్డారు. ఇలా సేకరించిన భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకని ఆరోపించారు.












Click it and Unblock the Notifications