పెద్ద నోట్ల రద్దుపై రఘువీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: పెద్ద నోట్ల రద్దు అంశంపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
పెద్ద నోట్ల రద్దు అనంతరం సామాన్యుల చేతిలోకి రాకముందే కొత్త నోట్లు ఉగ్రవాదులకు చేరాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎలా జరిగిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లభ్యం నెరవేరలేదని రఘువీరా రెడ్డి అన్నారు. గతంలో లక్షలో ఒక దొంగనోటు ఉండేదని, ఇప్పుడు బ్యాంకుల్లో కూడా దొంగనోట్లు డిపాజిట్ అయ్యాయని అన్నారు.

పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద నోట్లు రద్దయి 50రోజులు గడిచినా ప్రజల ఇబ్బందులు అలాగే ఉన్నాయని అన్నారు.
సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ మాయల ఫకీర్లని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా దోచుకునేందుకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు ఖర్చును పెంచారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే ఐదున్నర వేలకోట్లు ఖర్చు చేశామని అన్నారు.
భారీ దోపిడీలో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏకంగా 11వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.40వేల కోట్లకు పెంచారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు వ్యయాలను ఇష్టరీతిన పెంచే హక్కు ఎవరిచ్చారని రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications