నాగర్ సోల్- తిరుపతి ప్రత్యేక రైళ్లు: రూట్, షెడ్యూల్..!!
షిర్డీ- తిరుపతి ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్టులు కొనసాగుతున్నాయి. శ్రావణ మాసం లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో.. నాగర్ సోల్- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్ల నిర్వహణ పైన రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. గుంతకల్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ మేరకు రూట్ ను వెల్లడించారు.
తిరుపతి- షిర్డీ మధ్య భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ రైలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తిరుపతి-నాగర్‌సోల్ ప్రత్యేక రైలు (నం. 07427) ఆగస్టు 23వ తేదీన ఉదయం మూడున్నర గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు నాగర్‌సోల్‌కు చేరుకుంటుంది. కాగా, ఈ రైలు తిరుగు ప్రయాణపు రైలు (నం. 07428) ఆగస్టు 26న మధ్యాహ్నం రెండున్నర గంటలకు నాగర్‌సోల్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6-45 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని అధికా రులు వెల్లడించారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి తిరుపతికి నడుపుతున్న వారాంతపు రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్పు చేసారు. మూడు మార్గాల్లో తెలుగు రాష్ట్రాల మీదుగా తిరుపతికి రైళ్లు కొనసాగుతున్నాయి. రద్దీకి అనుగుణంగా రూట్ ను అధికారులు ఖరారు చేస్తున్నారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు
కాగా, తిరుపతి నుంచి నాగర్ సోల్ కు ఖరారు చేసిన ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, క్రిష్ణా, యాదగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, నిజామాబాద్, బాసర, ముడ్‌ఖేడ్, నాందేడ్, పూర్ణా, పర్బని, జల్నా, ఛత్రపతి శంభాజీ నగర్ స్టేషన్ల మీదుగా వెళ్తుందని అధికారులు వెల్లడించారు. కాగా.. ముంబాయి నుంచి బెంగళూరు కు ప్రారంభం కానున్న వందే భారత్ స్లీపర్ ను సైతం ఏపీ మీదుగా నడపాలని.. అందులో భాగంగా పుట్టపర్తిలో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కాగా.. తెలుగు రాష్ట్రాలకు సైతం త్వరలో కొత్తగా వందే భారత్ స్లీపర్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సికింద్రాబాద్ - ఢిల్లీ మార్గంలో ఈ నూతన సర్వీసు ప్రకటిస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications