చెన్నై- విజయవాడ వందేభారత్ పై కీలక నిర్ణయం, ఇక నుంచి..!!
వందేభారత్ ప్రయాణీకులకు రైల్వే శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. మరి కొన్ని కొత్త సర్వీసులను ప్రవేశ పెట్టేందుకు రైల్వే అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో డిమాండ్ ఉన్న మార్గాల్లో కొత్తగా కోచ్ ల సంఖ్యను రైల్వే శాఖ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక, తాజాగా ఎంపిక చేసిన మార్గాల్లో వందేభారత్ టికెట్ విధానంలోనూ కొత్త మార్పులు తీసుకొచ్చింది.
వందేభారత్ రైళ్ల టికెట్ ల పైన రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా కొత్త విధానం అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రయాణికులు రైలు బయలుదేరే 15 నిమిషాల ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారికి వెసులుబాటు కలిగేలా ఈ నిర్ణయం అమలు చేస్తుంది. కాగా.. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఈ సేవలు వందే భారత్ రైళ్లకు మాత్రమే వర్తిస్తాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు15 నిమిషాల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని దక్షిణ రైల్వే జోన్ కల్పించింది.

కాగా, ప్రస్తుతానికి ఈ రియల్ టైమ్ టికెట్ బుకింగ్ సౌకర్యం ప్రస్తుతం 8 రైళ్లలో మాత్రమే అందుబాటులోఉంది. ఈ రైళ్లన్నీ దక్షిణ రైల్వే జోన్‌కు చెందినవి. దక్షిణ రైల్వే జోన్‌లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. కొత్త విధానం ప్రకారం ప్రయాణీకులు IRCTC వెబ్‌సైట్ లేదా IRCTC యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. కావాల్సిన వివరాలు ఇచ్చిన తరువాత ఎగ్జిక్యూటివ్ లేదా చైర్ కార్‌ను ఎంచుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. టికెట్ కోసం ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి. SMS, ఇమెయిల్, WhatsApp ద్వారా టికెట్ అందుతుంది. ఇక, ఈ వెసులుబాటు ఎంపిక చేసిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు.
ఈ వందేభారత్ రైళ్లల్లో ఈ విధానం ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారు. వాటిల్లో మంగళూరు సెంట్రల్ - తిరువనంతపురం సెంట్రల్, 20632 తిరువనంతపురం సెంట్రల్ - మంగళూరు సెంట్రల్, 20627 చెన్నై ఎగ్మోర్ - నాగర్‌కోయిల్, 20628 నాగర్‌కోయిల్ - చెన్నై ఎగ్మోర్, 20642 కోయంబత్తూర్ - బెంగళూరు కంటోన్మెంట్, 20646 మంగళూరు సెంట్రల్ - మడ్గావ్, 20671 మధురై - బెంగళూరు కంటోన్మెంట్, 20677 డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ - విజయవాడ రైళ్లలో అమల్లో ఉండనుంది. చెన్నై నుంచి విజయవాడకు వచ్చే ప్రయాణీకులకు ఈ అవకాశం వినియోగించుకొనే వెసులుబాటు కలిగింది. దీంతో ప్రయాణీకులు రైళ్లో ఏ ఇంటర్మీడియట్ స్టేషన్ నుంచి అయినా వందే భారత్ రైలు బయలుదేరే 15 నిమిషాల ముందు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications