'సోనియాపై జగన్‌కు తీరిక దొరికిందా:బొత్స వేధింపువల్లే'

షిండేకు రాసిన లేఖలో సమైక్యమేది
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు వైయస్ జగన్ రాసిన లేఖలో సమైక్యం లేదని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అలాంటి జగన్‌కు సమైక్యం గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదన్నారు. విభజనకు తీర్మానంతో పని లేదని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అనడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమన్నారు.
ఆర్టికల్ 3 ప్రకారం విభజించాలన్న వైయస్ జగన్ ఇప్పుడు సమైక్యం అని ఎలా అంటారని ప్రశ్నించారు. విభజన విషయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణది శకుని పాత్ర అని మండిపడ్డారు.
వైయస్ జగన్ అండతోనే కాంగ్రెసు పార్టీ విభజనపై ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా జైపాల్ రెడ్డి మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజలు బొత్స కుటుంబం వేధింపులు భరించలేకనే ఆయన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications