Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు రాక కోసం..

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 62,263 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,733 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.65 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

Ram navami 2025 CM Chandrababu set to visist Vontimitta temple

కాగా- శ్రీరామనవమిని పురస్కరించుకుని క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యం బ్రహ్మోత్సవాలకు ముస్తాబు అవుతోంది. ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను టీటీడీ అధికారులు అంగరంగ వైభ‌వంగా నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఆల‌యంలో ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, ఏప్రిల్ 5న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7:30 నుండి 9:30 గంట‌ల వ‌ర‌కు, మళ్లీ రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వివిధ వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.

ఏప్రిల్ 6వ తేదీన ఉద‌యం 9:30 నుండి 10:15 నిమిషాల వ‌ర‌కు వృష‌భ‌ లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలనూ ఆహ్వానిస్తారు. అదే రోజు రాత్రి శేష వాహనంపై కోదండరాముడు ఊరేగుతాడు. 7వ తేదీన ఉదయం వేణుగాణ అలంకారంలో కటాక్షిస్తాడు. రాత్రి- హంస వాహన సేవ ఉంటుంది.

Ram navami 2025 CM Chandrababu set to visist Vontimitta temple

8న ఉదయం వటపత్రశాయి అలంకారం, రాత్రి సింహ వాహనం, 9న ఉదయం నవనీత కృష్ణాలంకారం, రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగుతారు. 10వ తేదీన ఉదయం మోహినీ అలంకారంలో దర్శనం ఇస్తాడు. రాత్రి గరుడసేవ ఉంటుంది. 11వ తేదీన ఉదయం శివధనుర్బాణ అలంకరణ, రాత్రి- కళ్యాణోత్సవము/ గజవాహన సేవ ఉంటుంది.

12వ తేదీన ఉదయం కన్నులపండువగా రథోత్సవం. 13న ఉదయం కాళీయమర్ధన అలంకారం, రాత్రి అశ్వవాహనంపై సీతాసమేత కోదండరాముడు భక్తులను కరుణిస్తాడు. 14వ తేదీన ఉదయం చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవం ముగుస్తుంది. రాత్రి ధ్వజావరోహణాన్ని నిర్వహిస్తారు. 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్నారు అర్చకులు.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సీతారాముల వారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. కడప ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా ఒంటిమిట్ట ఆలయానికి చేరుకుంటారు చంద్రబాబు. కల్యాణోత్సవంలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాముల వారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సహా కొందరు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ నేపథ్యంలో ఏర్పాట్లను టీటీడీ అధికారులు చురుగ్గా కొనసాగిస్తోన్నారు. తాజాగా టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ కల్యాణ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. భాకారాపేటలో పార్కింగ్ రోడ్ డైవర్షన్ మార్గాలు, భక్తులు ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా ఏర్పాటు చేయాలని సూచించారు.

చంద్రబాబు రానున్న నేపథ్యంలో దాదాపు 2,000 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టినట్లు చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎలాంటి తొక్కిసలాటకు అవకాశం లేకుండా క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. కల్యాణ వేదిక వద్ద అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక, పోలీసు, అన్నప్రసాదాలు పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+