భార్య, పిల్లలపై పెట్రోల్‌పోసి హత్యాయత్నం చేసిన భర్త

భార్య, పిల్లలపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు ఓ దుర్మార్గుడు . స్వల్ప గాయాలతో వారు బయటపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకొంది.

మదనపల్లె: భార్య, పిల్లలపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు ఓ దుర్మార్గుడు . స్వల్ప గాయాలతో వారు బయటపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకొంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Recommended Video

    Vijayawada : జనంపైకి దూసుకెళ్లిన బస్సు : Video

    కుటుంబ కలహల నేపథ్యంలో భర్తతో దూరంగా ఉంటున్న భార్యను కాపురానికి రావాలని భర్త కోరారు. ఆమె నిరాకరించింది. దీంతో భార్య, పిల్లలపై పెట్రోల్ పోసి హత్య చేసేందుకు భర్త ప్రయత్నం చేశారు.

    Ramana planst to murder his wife and children in Madanapally

    కడప పట్టణం సాయిపేటకు చెందిన ఆర్‌.రమణ ములకలచెరువు మండలం దేవులచెరువుకు చెందిన సునీతను 12 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి లక్ష్మీ, వేణు అనే ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య అనుమానం ఏర్పడి తరచూ గొడవపడేవారు. దీంతో రెండేళ్ల క్రితం సునీత పిల్లలను తీసుకుని పుట్టింటికి చేరుకుంది.

    అక్కడ గ్రామస్తులు అవమానిస్తుండడంతో తల్లిని వెంట తీసుకుని వచ్చి మదనపల్లెలోని రామారావుకాలనీలో ఉంటూ ఓ హోటల్‌లో పనిచేస్తోంది. 15 రోజుల క్రితం రమణ వచ్చి కాపురానికి రావాలని కోరాడు. ఆమె నిరాకరించింది. ఇక్కడే ఉందామని చెప్పడంతో ఉండిపోయాడు.

    తరువాత ఏమి జరిగిందో గురువారం భార్యాపిల్లలను గదిలో పెట్టి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ముగ్గురూ స్వల్పగాయాలతో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు పరారయ్యా డు. ఈ మేరకు బాధితులు ఫిర్యాదు చేసినట్లు, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+