జనసేన పార్టీకి ఉపాసన విరాళం?
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. జ్వరం రావడంతో ఈరోజు చేయాల్సిన ప్రచారాన్ని వాయిదా వేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపటి నుంచి యథావిధిగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. తాను స్వయంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఇక్కడ పవన్ ను ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంగా గీతను నిలబెట్టింది. కాకినాడ ఎంపీగా ఉన్న ఈమె మహిళా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందుతారని ఆ పార్టీ భావిస్తోంది. నియోజకవర్గ పరిధిలోనే ఇల్లు తీసుకున్న పవన్ కల్యాణ్ తన ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు.
రామ్ చరణ్ భార్య ఉపాసన జనసేన పార్టీకి రూ.5కోట్ల విరాళం ఇచ్చిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. అయితే ఇదంతా అవాస్తవమని, ఇందులో నిజం లేదని తేలిసింది. అయితే ఉపాసన జనసేనకు కొంత విరాళం ఇస్తే బాగుంటుందూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఉపాసన తనకు మామ అయిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లో మార్పు కోసం గట్టిగా పోరాడుతున్నారని, అటువంటివారికి ఉపాసనలాంటివారు మద్దతుగా నిలబడితే సమాజంలో మార్పు సాధ్యమవుతుందంటున్నారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను పూర్తిచేయాల్సి ఉంది. వీటిని ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత త్వరగా తమ హీరో నుంచి మరింత కొత్త సినిమాలు వస్తుంటాయనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. పవన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.80 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. వీటిని పార్టీ కార్యకలాపాలకు, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అందజేస్తున్నారు. తన సొంత డబ్బునే పార్టీకి ఖర్చుపెడుతుండటంతో ఆన్ లైన్ లో అభిమానులు విరాళాలు కూడా సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications