తెలుగుదేశం పార్టీకి రమ్యశ్రీ రాజీనామా: జనసేనలోకి వెళ్తున్నారా?
ఏలూరు: తూర్పు గోదావరి జిల్లా పెరవలి తెలుగుదేశం పార్టీ నాయకురాలు రమ్యశ్రీ ఆ పార్టీకి షాకిచ్చారు. ఆమె 2014లో పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అయితే గత కొంతకాలంగా తనకు పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
పార్టీ స్థానిక నేతల తీరుపై కలత చెందిన రమ్యశ్రీ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు,రాష్ట్ర అధ్యక్షులకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. కాగా, రమ్యశ్రీ, ఆమె భర్త మురళీకృష్ణలు త్వరలో జనసేనలో చేరనున్నట్లు ప్రచారంసాగుతోంది. శుక్రవారం వారు జనసేనానిని కలిసే అవకాశముందని అంటున్నారు.

జనసేనలోకి రాంబాబు
మొగల్తూరు శ్రీదేవి జానకీ థియేటర్ ఓనర్ రాంబాబు గురువారం జనసేనానిని కలిశారు. తాను పార్టీలో చేరుతున్నట్లు ఆ తర్వాత ప్రకటించారు. రాంబాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. ఆ పార్టీలో చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కొత్తపల్లి సుబ్బారాయుడి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఇప్పుడు జనసేనలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications