ఏపీలో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా
Temperature in AP: ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటోన్నాయి.. కొద్దిరోజులుగా. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతోండగా..మరి కొన్నిచోట్ల 40 డిగ్రీలకు పైగా ఎండ కాస్తోంది. మధ్యాహ్నం వరకు కనిపిస్తోన్న ఎండ తీవ్రత.. ఆ తరువాత మటుమాయం అవుతోంది. ఆకాశం మేఘావృతమౌతోంది. తేలికపాటి వర్షాలకు కారణమౌతోంది.
ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇప్పటికే అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడ్డాయి. ఇదే పరిస్థితి నేడు కూడా కొనసాగే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చు. అదే సమయంలో ఎండ తీవ్రత సైతం ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటోండగా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. గురువారం నాడు నంద్యాల జిల్లా గోస్పాడు, రుద్రవరంలో 42.1 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కడప, తిరుపతి, కర్నూలు జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం కనిపించంది.
జిల్లాలోని వేంపల్లెలో 41.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 41.4, కర్నూలులో 40.7 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది. అలాగే- రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శనివారం నాడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్రవడగాలులు, 83 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
గురువారం నంద్యాల జిల్లా గోస్పాడు,రుద్రవరంలో 42.1°C, వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో 41.5°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 41.4°C, కర్నూలులో 40.7°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. 36 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు.
ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడటానికీ అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications