బుచ్చయ్య రాజీనామాస్త్రం వెనుక రెండు కారణాలు- చంద్రబాబు లొంగుతారా ? లొంగదీసుకుంటారా ?
ఏపీలో రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచినా తట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసందుకు సిద్ధమయ్యారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ ఆయన రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో పార్టీ ఆయన్ను ఎక్కడ పట్టించుకోలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతన్నాయి. ఇందులో రెండు విషయాల్లో టీడీపీ అధిష్టానం ఆయనకు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ పొలిట్ బ్యూరో వ్యవస్ధాపక సభ్యుడైన బుచ్చయ్య .. రాజీనామాస్త్రం సంధించారు.

బుచ్చయ్య రాజీనామాస్త్రం
టీడీపీ వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరు, పార్టీలో అధినేత చంద్రబాబు కంటే సీనియర్ నని చెప్పుకునే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు అదే పార్టీపై అలిగారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఏకంగా రాజీనామాస్త్రం సంధించారు. పార్టీలో తన అనుచరులకు కీలక పదవులు దక్కకపోవడమే ప్రధాన కారణమని పైకి చెప్తున్నా అంతకు మించిన కారణాలే దీనికి దారి తీసినట్లు తూర్పుగోదావరి జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుచ్చయను పార్టీ అధిష్టానం బుజ్జగిస్తుందా లేక పొమ్మంటుందా అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.

బుచ్చయ్య రాజీనామా వెనుక ?
టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన బుచ్చయ్య చౌదరి హఠాత్తుగా పార్టీ వైఖరిపై అలిగి రాజీనామా అస్త్రం సంధించడం వెనుక పలు సీరియస్ కారణాలే కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) ఛైర్మన్ పోస్టు ఆశించడం అయితే రెండవది తన నియోజకవర్గ వ్యవహారాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవడమేనని తెలుస్తోంది. ఈ రెండు అంశాలపై కొంతకాలంగా బుచ్చయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీన్ని ఎలా బయటపెట్టాలో తెలియక అంతర్మథనం చెందుతున్న బుచ్చయ్య.. ఇవాళ రాజీనామా ప్రకటన రూపంలో బయటపడ్డారు.

పీఏసీ పదవి వచ్చినట్లే వచ్చి...
రెండేళ్ల క్రితం పీఏసీ ఛైర్మన్ పదవికి టీడీపీ నుంచి ఓ ఎమ్మెల్యే పేరు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అధిష్టానం సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కాకుండా లెక్కల మాస్టారుగా పేరున్న పయ్యావుల కేశవ్ ను ఎంపిక చేసింది. అయితే పీఏసీ ఛైర్మన్ పదవి తీసుకున్న తర్వాత పయ్యావుల మౌనంగా ఉండిపోయారు. దీంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం వైసీపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్న తనను కాదని పయ్యావులకు ఇస్తే ఏం జరిగిందో చూడాలని అధిష్టానానికి అంతర్గతంగా బుచయ్య సవాల్ విసిరారు. దీంతో పయ్యావుల రెండేళ్ల పదవీకాలం పూర్తి కాగానే పీఏసీ ఛైర్మన్ పదవిని బుచ్చయ్యకు ఇవ్వాలని అప్పట్లో అధిష్టానం భావించింది. కానీ అనూహ్యంగా పరిస్ధితులు మారిపోయాయి. తనకు మరోసారి పీఏసీ పదవి దక్కదని తేలిపోవడంతో పయ్యావుల ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వాన్ని అతి కొద్దికాలంలోనే దారుణంగా ఇరుకునపెట్టారు. దీంతో తిరిగి పయ్యావుల తెరపైకి వచ్చేశారు. సహజంగానే బుచ్చయ్యకు అవకాశం దూరమైంది.

అచ్చెన్నాయుడుపై గుర్రు ?
గతంలో రాజమండ్రి ఎమ్మెల్యేగా పనిచేసిన బుచ్చయ్య చౌదరికి నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉంది. ఆ తర్వాత రాజమండ్రి సిటీ, రూరల్ గా నియోజకవర్గాలు విభజన అయినా రెండు నియోజకవర్గాల్లోనూ బుచ్చయ్య హవా కొనసాగుతోంది. ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ స్వయంగా అచ్చెన్నాయుడు అన్నకూతురే కావడం, ఆమెకు అంతగా రాజకీయ అనుభవం లేకపోవడంతో అచ్చెన్నాయుడు జోక్యం పెరిగింది. ఇది అప్పటివరకూ రాజమండ్రిలో బుచ్చయ్యకు ఉన్న పట్టును ప్రశ్నార్ధకంగా మార్చేసింది. దీంతో సహజంగానే అచ్చెన్నాయుడు తీరుపై బుచ్చయ్య గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

బుజ్జగింపులకు బుచ్చయ్య సమయమిచ్చారా ?
టీడీపీ అధిష్టానం వైఖరిపై అసంతృప్తితో ఎమ్మెల్యే పదవికి, పార్టీకీ రాజీనామా చేస్తానని ఇవాళ ప్రకటించిన బుచ్చయ్య చౌదరి ఈ నెల 25న దీనికి ముహుర్తంగా పెట్టుకున్నారు. అదే రోజు రెండు పదవులకు రాజీనామా చేస్తానని ఆయన చెప్తున్నారు.దీనికి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది. ఈ మధ్యలో చాలా జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలు పలువురు తనను కలిసి బుజ్జగిస్తారనే అంచనాలో బుచ్చయ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కొందరు జిల్లా నేతలు వచ్చి ఆయన్ను కలిశారు. రేపటి నుంచి ఈ నెల 25 లోపు మరికొందరు వచ్చి కలిసే అవకాశం ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా రాజమండ్రి వస్తారని తెలుస్తోంది. దీంతో తనను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానానికి బుచ్చయ్య ఈ నెల 25 వరకూ గడువు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ లోపు టీడీపీ పట్టించుకోకపోతే బుచ్చయ్య తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications