3 ప్లాన్స్ పై సంచలన ఆఫర్లు ప్రకటించిన రిలయన్స్ జియో

జియో సిమ్ కార్డు వాడుతున్నవారికి శుభవార్త. రిలయన్స్ జియో తన ఏడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా మూడు ప్లాన్స్ పై ఈ ప్రయోజనాలు అందుతున్నాయి. రూ.299, రూ.749, రూ.2,999 ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి రీఛార్జితోపాటు అదనపు బెనిఫిట్స్ ను కూడా ఇస్తోంది. సెప్టెంబరు 5 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఏ ప్లాన్ రీఛార్జి చేస్తే ఎటువంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.

రూ. 299 ప్లాన్: జియో రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి వ్యాలిడిటీ 28 రోజులు లభిస్తుంది. ప్రతిరోజు 2 జీబీ డేటా ఇస్తారు. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీటితోపాటు అదనంగా 7జీబీ డేటా ఇస్తున్నారు.

relinace jio new plans

రూ. 749 ప్లాన్: జియో రూ.749 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 2 జీబీ డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తోపాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీటితోపాటు అదనంగా 14జీబీ డేటా లభిస్తుంది. 7జీబీ డేటా కూపన్స్ రెండు ఇస్తారు.

రూ. 2,999 ప్లాన్: జియో రూ.2,999 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 2.5జీబీ డేటా ఇస్తారు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ తోపాటు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీటితోపాటు అదనంగా 21జీబీ డేటా లభిస్తుంది. 7జీబీ డేటా కూపన్స్ మూడు ఇస్తారు. దీంతో పాటు ఆజియో నుంచి రూ.200 తగ్గింపు, నెట్‌మెడ్స్ నుంచి రూ.800 వరకు 20 శాతం తగ్గింపు, స్విగ్గీ నుంచి రూ.100 తగ్గింపు, రూ.149 లేదా అంతకన్నా ఎక్కువ కొనుగోలుపై ఉచితంగా మెక్‌డోనాల్డ్స్ మీల్, రిలయన్స్ డిజిటల్‌లో 10 శాతం తగ్గింపు, యాత్రలో ఫ్లైట్ బుకింగ్స్‌పై రూ.1,500 వరకు తగ్గింపు, హోటల్ బుకింగ్స్‌పై 15 శాతం తగ్గింపు లభించనుంది. యాత్రలో రూ.4వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అదనపు డేటా వోచర్స్ మై జియో యాప్ లో ఉంటాయి. వినియోగదారులు వీటిని రీడీమ్ చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+